Varun Tej: వరుణ్ ఇంట్లో ఘనంగా గణపతి ఉత్సవాలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా కాబోయే కోడలు..

Varun Tej:  మెగా ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఇంట్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో లావణ్య స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2023, 07:47 PM IST
Varun Tej:  వరుణ్ ఇంట్లో ఘనంగా గణపతి ఉత్సవాలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా కాబోయే కోడలు..

Varun-Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. జూన్ లో వీరిద్దరి నిశ్చితార్థం బంధువులు, సన్నిహితులు సమక్షంలో వైభవంగా జరిగింది. తాజాగా వరుణ్ ఇంట్లో వినాయక చవితి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కాబోయే కోడలు లావణ్య సందడి చేసింది. అంతేకాకుండా వరుణ్ తల్లిదండ్రులతో కలిసి పూజ చేసింది.  వరుణ్, లావణ్య సంప్రదాయ దుస్తులు ధరించి గణపతిని పూజించారు. రుణ్ తేజ్ గ్రీన్ కుర్తా ధరించగా.. లావణ్య అందమైన చీర ధరించింది. ఈ ఫొటోలను వరుణ్ తేజ్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా నిహారికను మిస్ అవుతున్నట్లు వరుణ్ పేర్కొన్నాడు.  ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

మిస్టర్ సినిమా సమయంలో వరుణ్, లావణ్య ప్రేమలో పడ్డారు. అది కాస్త పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 9వ తేదీన నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. వరుణ్, లావణ్య వివాహం నవంబరులో ఇటలీలో జరగనుందని తెలుస్తోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు కొద్ది సన్నిహితుల మాత్రమే హాజరుకానున్నారు. అనంతరం హైదరాబాద్‍లో గ్రాండ్‍గా రిసెప్షన్ పెట్టనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా పూర్తి సమచారం రావాల్సి ఉంది. రీసెంట్ గా వరుణ్  'గాండీవధారి అర్జున' సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు లావణ్య ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

Also Read: Mega Family: మెగా ఇంట ఘనంగా వినాయక చవితి సంబరాలు, ఫోటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Trending News