Horoscope: అక్టోబర్ 2 ఈ రాశులు వారికి ఎంతో ముఖ్యమైన రోజు..ఎందుకో తెలుసా?

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 2 ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు కొన్ని రాశుల వారికి లాభాలతో పాటు ఆర్థికంగా, సామాజికంగా నష్టాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 08:40 AM IST
Horoscope: అక్టోబర్ 2 ఈ రాశులు వారికి ఎంతో ముఖ్యమైన రోజు..ఎందుకో తెలుసా?

Horoscope Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. అంతేకాకుండా నక్షత్రాల్లో కూడా కదలికలు జరగబోతున్నాయి. అంతేకాకుండా అక్టోబర్ రెండో తేదీన కుజ, శుక్ర గ్రహాలు కూడా సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 2 తేదీన ఏయే రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు నిస్సృహ భావనను కలిగి ఉంటారు. ఈ సమయంలో తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా జీవితం అస్తవ్యస్తంగా మారవచ్చు.. కాబట్టి ఈ సమయంలో వాళ్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు స్నేహితుల మద్దతు లభించి మంచి లాభాలు పొందుతారు.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. విద్యను అభ్యసించే వారికి కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అదనపు ఖర్చుల వల్ల అనేక రకాల ఇబ్బందులు రావచ్చు. ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అధిక కోపం కారణంగా అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు భవనాలు కోసం పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఎంతో ఓపికతో ఉండడం చాలా మంచిది. అధిక కోపం కారణంగా అనేక రకాల సమస్యలు రావచ్చు కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి. ఆరోగ్య విషయంలో కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మద్దతు లభించి.. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో కొన్ని కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

సింహరాశి:
సింహరాశి వారికి ఈ సమయం కొంత అనుకూలంగా ఉంటుంది. వీరు ఉద్యోగాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబానికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో స్నేహితుల మద్దతు లభించి లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి శ్రమ పెరగడం కారణంగా ఒత్తిడికి లోనవుతారు. వీరు ఈ సమయంలో అధిక కోపాన్ని నివారించుకోవడం చాలా మంచిది.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News