Low BP Remedies: ఆధునిక పోటీ ప్రపంచంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇందులో అతి ప్రధానమైంది రక్తపోటు సమస్య. ఇది రెండు రకాలుగా ఉంటుంది. లో బీపీ, హైబీపీ. ప్రస్తుతం లో బీపీ సమస్య గురించి తెలుసుకుందాం.
లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోవడంతో చాలామంది లోబీపీ బారిన పడుతున్నారు. సరైన పౌష్టికాహారం తినకుండా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడటం వల్ల రక్తపోటులో సమస్య ఏర్పడి లో బీపీ లేదా హై బీపీకు దారితీస్తోంది. లోబీపీ సమస్యకు చాలామంది మందులు వాడుతుంటారు. అయితే దీనివల్ల దుష్పరిణామాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. లోబీపీ సమస్యను సాధ్యమైనంతవరకూ సహజసిద్ధమైన చిట్కాలతో తగ్గించవచ్చంటున్నారు. బీపీ తక్కువగా ఉంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు.
సాధారణ వ్యక్తి సాధారణ రక్తపోటు 120/80 mmHg ఉండాలి. ఇది 90/60 mmHg కంటే తక్కువైతే ఆ వ్యక్తికి లోబీపీ ఉన్నట్టు అర్ధం. లో బీపీ కారణంగా తల తిరగడం, తలనొప్పి, వాంతులు, అలసట, బలహీనత వంటి లక్షణాలు కన్పిస్తాయి. సకాలంలో ఈ సమస్యను పరిష్కరించకపోతే హార్ట్ ఎటాక్‌కు దారితీయవచ్చు. ప్రాణాంతక పరిస్థితి ఎదురుకావచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మూడు చిట్కాలున్నాయి. వీటి ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
అశ్వగంధ
లో బీపీ సమస్యను నియంత్రించేందుకు అశ్వగంధ అద్భుతంగా ఉపయోగపడుతుందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు శరీరంలోని రక్త ప్రసరణను నియంత్రణలో ఉంచుతాయి. రోజూ ఒక చెంచా అశ్వగంధ పౌడర్‌ను అర గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.
తులసి ఆకులు
లో బీపీ సమస్యతో బాధపడేవారికి తులసి ఆకులు అద్భుతమైన ఔషధమనే చెప్పాలి. ఇందులో పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం వంటి పోషకాలు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. ఫలితంగా బీపీ నియంత్రణలో ఉంటుంది. బీపీ తక్కువగా ఉన్నప్పుడు 4 తులసి ఆకుల్ని నమిలి తింటే పరిస్థితి సాధారణమౌతుందంటారు.
కిశ్మిస్
లో బీపీ సమస్యను పరిష్కరించేందుకు కిశ్మిస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. రోజూ రాత్రి వేళ పడుకునేముందు 4-5 కిస్మిస్లను నీళ్లలో నానబెట్టాలి. ఉదయం లేవగానే పరగడుపున నీళ్లతో సహా కిస్మిస్ తినాలి.. ఇలా చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ సాధారణ స్థాయిలో ఉంటుంది.
Also read: Child Health Tips: మీ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం కావాలంటే ఈ పోషకాలు తప్పనిసరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook