Supreme Court: టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై ఇవాళ మరోసారి హోరాహోరీగా వాదనలు సాగాయి. ఇవాళ్టి వాదనలు కూడా పూర్తిగా సెక్షన్ 17ఏ చుట్టూనే సాగాయి. సెక్షన్ వర్తిస్తుందా లేదా అనేది తేల్చాలనే కోణంగా ఇరుపక్షాలు వాదించాయి. ముకుల్ రోహత్గీ వర్సెస్ హరీష్ సాల్వే మధ్య పోటాపోటీ వాదనలు జరిగాయి.
ఏపీ స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు భవితవ్యం శుక్రవారం అక్టోబర్ 20న తేలిపోనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ హోరాహోరీగా వాదించారు. శాసనసభ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు అని ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు. సెక్షన్ 482 కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉదహరించారు. సెక్షన్ 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగినందున చంద్రబాబు కేసులో ఇది వర్తించదన్నారు. ఓ వ్యక్తిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైనప్పుడు కోర్టచు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే మిగిలిన సెక్షన్ల ప్రకారం కేసు కొనసాగుతుందని రోహత్గీ తెలిపారు.
అనంతరం హరీష్ సాల్వే వర్చువల్‌గా తన వాదనలు విన్పించారు. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ పలు కేసుల్ని ఉదహరించారు. 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసును హరీష్ సాల్వే ప్రస్తావించారు,. 1964 నాటి రతన్ లాల్ కేసును కూడా కోర్టుకు గుర్తు చేశారు. రాజకీయ కక్ష సాధింపుల్ని నిరోధించేందుకే సెక్షన్ 17 ఏ ఉందని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనని హరీష్ సాల్వే తెలిపారు. 73 ఏళ్ల వయస్సున్న చంద్రబాబును ఇప్పటికే 40 రోజులుగా జైళ్లో ఉంచారని, క్వాష్ చేయకపోతే కనీసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనికి కోర్టు నిరాకరించింది. మధ్యంతర బెయిల్ కుదరదని స్పష్టం చేసింది. ఈ కేసుకు సెక్షన్ ఏ వర్తిస్తుందా లేదా అనేది తేల్చేస్తామన్నారు. వాదనలు ముగిశాయని ఇక క్వాష్ చేయాలా వద్దా అనేది తదుపరి విచారణ శుక్రవారం ఆదేశాలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
Also read: Supreme Court: స్వలింగ వివాహాల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పు, ఆ అధికారం పార్లమెంట్‌దే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook