Sesame seeds:
నువ్వులు అనేవి ఔషధాల గని లాంటిది. ఇవి రోజు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారడమే కాకుండా ఎన్నో రకాల రోగాలను రాకుండా నివారించగలుగుతాం. ఆయుర్వేదంలో కూడా నువ్వులను ఔషధంగా ఉపయోగిస్తారు. మనకు సులభంగా ఎక్కడైనా దొరికే నువ్వులు క్రమం తప్పకుండా వాడడం వల్ల ఎన్నో రకాల రోగాలను నివారించవచ్చు. నువ్వుల్లో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ముఖ్యంగా ఆడవారు నువ్వులు ఎక్కువగా తినాలి అని పెద్దలు ఎప్పుడూ అంటూ ఉంటారు.
మార్కెట్లో మామూలుగా నొప్పులు రెండు రకాల లభ్యమవుతాయి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. రెంటికి పెద్ద తేడా ఏమీ ఉండదు.. రెండిటిలో పోషక విలువలు సమానంగానే ఉంటాయి. నువ్వులను ఆహారంలో చాలా రకాలుగా ఉపయోగిస్తారు. మనం ఎక్కువగా వీటిని తినే బిస్కెట్స్ లేదా స్వీట్స్ పై డెకరేటివ్ ఐటమ్ గా చూస్తాం. కొన్ని ప్రాంతాలలో నువ్వులతో పచ్చడి కూడా చేసుకుంటారు. అంతేకాదు నువ్వుల నుంచి తీసి నన్ను నేను వంటకు విరివిగా ఉపయోగిస్తారు.
నల్ల నువ్వులలో కాల్షియం, ఫైబర్ ,ఐరన్,ఫాస్పరస్ అధిక మోతాదులో లభిస్తుంది. అందుకే నల్ల నువ్వులను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ బలోపేతంగా మారుతుంది ,జీర్ణక్రియ క్రమబద్ధంగా జరగడం వల్ల గ్యాస్, మలబద్దకం , ఎసిడిటీ లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవ్వరైనా నువ్వులు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కానీ కొందరికి నువ్వులు సరిపడవు అలాంటి వారు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి.
నల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు,పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు,ఫైబర్ కంటెంట్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టి ఇది మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషక విలువలను సమర్ధవంతంగా అందిస్తుంది. క్రమం తప్పకుండా నల్ల నువ్వులు తీసుకునే వారికి దీర్ఘకాలిక రోగాలు ఉత్పన్నమయ్యే ఆస్కారం తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే కాళ్ళ ,కీళ్ల నొప్పులు లాంటివి చాలావరకు తగ్గుతాయి.
నువ్వులు రక్తంలోని చెడుకొలస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంతోపాటు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. గుండె జబ్బు ఉన్న వారికి కూడా నువ్వులు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇందులో అధిక మోతాదులో ఉండే ఫైబర్ పేగులను బాగా శుభ్రం చేస్తుంది. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా నువ్వులను నిరభ్యంతరంగా తినవచ్చు. వీటిలో దొరికే విటమిన్ బి6, మెగ్నీషియం మెదడును ఉత్తేజంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇలా మనకు ఎన్నో పోషకాలను అందించడంతోపాటు శరీరాన్ని దృఢంగా చేసే నువ్వులను రోజు క్రమం తప్పకుండా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..