Volvo Car India: లగ్జరీ కార్లకు పెరుగుతున్న క్రేజ్, 40 శాతం వృద్ధి సాధించిన వోల్వో

Volvo Car India: లగ్జరీ కార్ల విభాగంలో ప్రముఖ కంపెనీ వోల్వో కార్ ఇండియా విశేషంగా ఆకట్టుకుంటోంది. గణనీయమైన వృద్ధి సాధిస్తోంది. కేవలం 9 నెలల వ్యవధిలో 40 శాతం అమ్మకాలు పెంచుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 21, 2023, 12:45 PM IST
Volvo Car India: లగ్జరీ కార్లకు పెరుగుతున్న క్రేజ్, 40 శాతం వృద్ధి సాధించిన వోల్వో

Volvo Car India: వోల్వో కార్ ఇండియా దేశంలో అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. లగ్జరీ కార్లపై దేశంలో మోజు పెరుగుతుండటంతో వోల్వో, బీఎండబ్ల్యూ కార్లకు ఆదరణ లభిస్తోంది. ధర ఎక్కువైనా పెద్దగా వెనుకాడటం లేదు. అందుకే వోల్వో వంటి లగ్జరీ కార్లు గణనీయమైన అమ్మకాలు సాదిస్తున్నాయి. 

దేశంలో ఇటీవల గత కొద్దికాలంగా లగ్జరీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. సౌకర్యంతో పాటు విలాసంపై కూడా ఆసక్తి పెరగడంతో బీఎండబ్ల్యూ, వోల్వో, మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ మోటార్స్, ఏస్టన్ మార్టిన్ వంటి కార్లు ఇండియన్ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే వోల్వే కార్ ఇండియా దేశంలో తన అమ్మకాల్ని పెంచుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ అంటే 9 నెలల వ్యవధిలో ఏకంగా 40 శాతం వృద్ధి సాధించింది. ఈ 9 నెలల కాలంలో వోల్వో ఇండియా 1751 యూనిట్ల విక్రయాలు జరిపింది. గత ఏడాది ఇదే కాలంలో 1251 కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇందులో వోల్వో XC60 మోడల్ కారు పాత్ర కీలకంగా. 40 శాతం వృద్ధిలో 35 శాతం ఈ ఒక్క కారుదే కావడం విశేషం. ఇండియాలో తయారయ్యే ఎలక్ట్రిక్ కారు XC40 రీఛార్జ్‌కు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. 

వోల్వో  XC40 రీఛార్జ్ అమ్మకాలు

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో XC40 రీఛార్జ్ మొత్తం 419 యూనిట్లు అమ్మకాలు జరిపింది. కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఇది 24 శాతం. గత 9 నెలల వ్యవధిలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 27 శాతంగా ఉన్నాయి. భారతీయ కార్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న ఆదరణ దీనిని బట్టి అర్దం చేసుకోవచ్చు.

వోల్వో కార్ ఇండియా అందిస్తున్న వివరాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే జనవరి నుంచి సెప్టెంబర్ 2023 వరకూ 40 శాతం విక్రయాలు పెరిగాయి. ఈ ఏడాది మూడు త్రైమాసికాల్లో కూడా గణనీయమైన వృద్ధి రేటు కన్పిస్తోంది. XC40 రీఛార్జ్, C40 రీఛార్జ్ అమ్మకాలే ఇందులో ఎక్కువ. కంపెనీ పట్ల భారతీయ మార్కెట్‌లో కస్టమర్లకు ఉన్న విశ్వాసం, నమ్మకం దీనికి కారణమని కంపెనీ చెబుతోంది. ఫలితంగా త్వరలో ప్రీమియం, టికావూ వాహనాల్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు మార్గం సుగమమౌతోంది. వోల్వో కార్ ఇండియా ఇటీవలే C40 లాంచ్ చేసింది. దేశంలో వోల్వోకు ఇది రెండవ ఎలక్ట్రిక్ కారు. 

C40 రీఛార్జ్‌‌కు ఇండియన్ మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఎందుకంటే లాంచ్‌కు ముందే ఈ కంపెనీకు 100 బుకింగ్స్ నమోదయ్యాయి. C40 రీఛార్జ్ ఇండియాలోని బెంగళూరు సమీపంలో ఉన్న హోస్కోట్‌లో తయారౌతోంది. 

Also read: Maruti Jimny Offers: మారుతి జిమ్నీపై 1 లక్ష రూపాయల డిస్కౌంట్ మరో పదిరోజులే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News