Pawan Kalyan : బోయపాటి శ్రీను గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న మాస్ డైరెక్టర్స్ లో స్టార్ మాస్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీనుదే. భద్రా సినిమాతో మనకు పరిచయమైన ఈ డైరెక్టర్ ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలు అయినా సింహా, లెజెండ్, అఖండ తో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు.
ఒకానొక స్టేజిలో బాలకృష్ణ అని కరెక్టుగా స్క్రీన్ పైన చూపించే డైరెక్టర్ ఎవరు అంటే అందరూ బోయపాటి శ్రీనునే అంటూ ఆకాశానికి ఎత్తేసేలా చేసుకున్నాడు. అలా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్సుగా మారిన బోయపాటి ఈ మధ్య స్కంద సినిమాతో మన ముందుకు. అఖండ తర్వాత బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో రామ్ హీరోగా చేసిన ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉనిన్నాయి. సినిమా అనుకున్నంత రేంజ్ లో లేకపోవడంతో.. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పెద్దగా పెర్ఫార్మ్ చేయలేక పోయింది.
ఇక ప్రస్తుతం అఖండ 2 స్క్రిప్ట్ వర్క్ పైన బిజీగా ఉన్నారు ఈ డైరెక్టర్. ఈ నేపథ్యంలో బోయపాటి ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ కి ఫిల్టర్ లేదు. ఆయన ఏది అనుకుంటే అది చేసేస్తారు " అని చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. ఎక్కడ మంచి ఉంటే అక్కడ, ఎక్కడ నిజాయితీ, న్యాయం ఉంటే అక్కడ ఆయన నిలబడతారని పవన్‌కి హ్యాట్సాఫ్ అని అన్నారు బోయపాటి. బాలకృష్ణకి వీర ఫ్యాన్ అయిన బోయపాటి పవన్ కళ్యాణ్ ని పోగదడం బాలయ్య అభిమానులను అలానే పవన అభిమానులను సంతోషానికి గురిచేస్తుంది.
కాగా చాలా సంవత్సరాల నుంచి మీడియా వారు అలానే పవన్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ తో బోయపాటి సినిమా ఎప్పుడు అని అడుగుతూ వచ్చారు. ఇక దీనికి సమాధానం ఇప్పుడు ఇచ్చారు ఈ దర్శకుడు తను హైజానర్‌లో సినిమా తీయాలని అనుకుంటానని అందువల్లే పవన్ ముందుకు రారని చెప్పారు బోయపాటి. పొలిటికల్‌గా పవన్ ఎంగేజ్ అయి ఉండటం వల్ల అన్ని రోజులు ఆయన ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని.. ఒకవేళ ఇస్తే తప్పకుండా భవిష్యత్తులో పవన్‌తో సినిమా తీస్తానని క్లారిటీ ఇచ్చేశారు బోయపాటి శ్రీను. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అది ఊర మాస్ గా ఉండటం ఖాయం అని పవన అభిమానులు అంచనాలు వేసుకునేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు
ఇది కూడా చదవండి: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.