Revanth Reddy: కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేసినా.. బీఆర్‌ఎస్ ఓటమి ఖాయం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Comments On CM KCR: మరోసారి కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారాలు చేసినా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. ఆ పార్టీని ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరని అన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 26, 2023, 12:20 PM IST
Revanth Reddy: కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేసినా.. బీఆర్‌ఎస్ ఓటమి ఖాయం: రేవంత్ రెడ్డి

Revanth Reddy Comments On CM KCR: సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. రిటైర్ అధికారులను తక్షణమే తొలగించాలని చెప్పామని అన్నారు. ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారని.. కొందరు అధికారులు బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణ టీమ్‌లా పనిచేస్తున్నారని ఆరోపించారు. అంజనీ కుమార్‌ను.. స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి స్పష్టంగా చెప్పామని తెలిపారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని తాము చెబుతుంటే.. బీఆర్ఎస్ తమపై విష ప్రచారానికి దిగిందని మండిపడ్డారు.

సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్ 2 లోగా విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెల్లిస్తుందని హమీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను బూచిగా చూపి కేసీఆర్ చెల్లింపులు ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేసినా.. బీఆర్‌ఎస్ ఓటమిను ఎవరూ కాపాడలేరని జోస్యం చెప్పారు.

"మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. 
క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు.. డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను నివేదికను బయటపెట్టడం లేదు.. కేంద్రానికి.. బీఆర్ఎస్ కు ఉన్న లాలూచీ ఏంటి..? కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలేదు." అని రేవంత్ రెడ్డి అన్నారు.

మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. హరీష్ రావు, కేటీఆర్ బిల్లా రంగా లాంటివారని.. కేసీఆర్ చార్లెస్ శోభారాజ్ లాంటి వారని ఎద్దేవా చేశారు. వాళ్లేం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగుతున్నారని ఫైర్ అయ్యారు. ఈడీ, ఐటీ, సీబీఐ బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లని ఆరోపించారు రేవంత్ రెడ్డి. 

Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   

Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News