Skanda OTT: ఓటీటీ లవర్స్ కు బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద డిజిటల్ స్ట్రీమింగ్‌ వాయిదా..

Skanda OTT: టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌ లేటెస్ట్ మూవీ స్కంద. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2023, 10:37 AM IST
Skanda OTT: ఓటీటీ లవర్స్ కు బ్యాడ్‌ న్యూస్‌.. స్కంద డిజిటల్ స్ట్రీమింగ్‌ వాయిదా..

Skanda Movie OTT Release Postponed:  ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పొతినేని- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన సినిమా 'స్కంద'. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు మిక్సడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ తొలి రోజు భారీగానే కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ.  అయితే ఆ తర్వాత నుంచి ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించడంలో ఈ మూవీ విఫలమైంది.

అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. స్కంద డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈమూవీ నేటి నుంచి అంటే అక్టోబరు 27 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై అటు చిత్ర బృందం నుంచి కానీ, ఇటు డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఓటీటీ ప్రేమికులు నిరాశ చెందుతున్నారు. అయితే ఈ మూవీ నవంబరు రెండో వారంలో ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

సుమారు రూ.50 కోట్ల వ్యయంతో స్కంద సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. రామ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ మూవీలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, ఇంద్రజ, శరత్ లోహితాశ్వ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మాస్ ఆడియెన్స్ కు ఈ మూవీ పుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలోని మాస్ కోణాన్ని చూపించిన రామ్.. దానిని మరో స్థాయికి తీసుకెళ్లాడు. 

Also Read: Pawan Kalyan : ఓజీ సినిమా విడుదల తేదీ గురించి షాకింగ్ హింట్ ఇచ్చిన చిత్ర బృందం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News