Tata Nexon Facelift 2023: అతి తక్కువ ధరలోనే టాటా నెక్సాన్ నుంచి మరో నంబర్-1 SUV..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

Tata Nexon Facelift Model 2023: అతి తక్కువ ధరలోనే టాటా నెక్సాన్ మరో నంబర్-1 SUVను మార్కెట్‌లోకి విడుదల చేసింది.  ఈ ఎస్‌యూవీ అనేక రకాల ఫీచర్స్‌తో పాటు అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అయితే ఈ కార్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2023, 10:30 AM IST
Tata Nexon Facelift 2023: అతి తక్కువ ధరలోనే టాటా నెక్సాన్ నుంచి మరో నంబర్-1 SUV..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

 

Tata Nexon Facelift Model 2023: ప్రపంచవ్యాప్తంగా టాటా కంపెనీకి కార్లకు ఎంత పేరు ఉందో అందరికీ తెలిసిందే. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న నంబర్-1 SUV ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను టాటా నెక్సాన్ ప్రారంభించింది. ఈ కారు ఇటీవలే నెక్సాన్ విడుదల చేసిన కార్ల కంటే మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉన్న SUVల్లో ఇది ఒకటని చెప్పవచ్చు. మీరు కూడా ఈ టాటా నెక్సాన్ విడుదల చేసిన SUV కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్లు మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా 6 నుంచి 8 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. నెక్సాన్ 15,235 యూనిట్లతో SUV సెగ్మెంట్‌లో మొదటి స్థానంలో ఉండడంవల్ల నెక్సాన్ విడుదల చేసిన ఏ వేరియంట్‌ అయినా 6 నుంచి 7 వారాలు   వేచి ఉండాల్సిందే. ఇక ఈ  ఫేస్‌లిఫ్ట్ SUV పూర్తి వివరాల్లోకి వెళితే..టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్, కొలతలు నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్, హారియర్ EV కాన్సెప్ట్‌లను పోలి ఉంటుంది.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

కానీ హెడ్‌లైట్‌లలో మాత్రం కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వీటి లైట్స్ స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంటాయి. టాప్ వేరియంట్‌లో సీక్వెన్షియల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్‌లు (DRLలు)తో కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ SUV బంపర్ దిగువ భాగంలో మందపాటి స్ట్రిప్ ను కలిగి ఉంటుంది. ఈ SUV 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో కాంట్రాస్టింగ్ కలర్‌లో హైలైట్ ను కలిగి ఉంటుంది. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు టైల్‌లైట్‌లను కలుపుతూ పూర్తి-వెడల్పు LED లైట్ బార్‌ను కలిగి ఉంటుంది.

SUVలో కొలతల పరంగా ఎలాంటి మార్పులు లేవు..పొడవు, ఎత్తు వరుసగా 2mm నుంచి 14mm పెరిగింది. అయితే వెడల్పు  మాత్రం 7మి.మీ మేర తగ్గింది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికొస్తే.. 2,498mm ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ SUV లో కంపెనీ బూట్ స్పేస్‌ను 32 లీటర్లు పెంచింది. ఇక ఈ కారు ఇంటీరియర్ ఫేస్‌లిఫ్ట్ కర్వ్ కాన్సెప్ట్‌ని పోలి ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో  చాలా తక్కువగా ఫిజికల్ బటన్స్ ఉంటాయి. కారులో అన్నింటినీ కంట్రోల్ చేసేందుకు HVAC టచ్-ఆధారిత ప్యానెల్‌ ను కస్టమర్స్ కి పరిచయం చేసింది. దీంతోపాటు ఈ కారు అనేక రకాల ఫీచర్లతో అందుబాటులో ఉంది.

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News