Vizianagaram Train Accident Updates: 8 మంది మృతి.. 40 మందికిపైగా గాయాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!

Vizianagaram Train Accident Help Line Numbers: విజయనగరం జిల్లాలో జరిగన రైలు ప్రమాద నేపథ్యంలో అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం ఎప్పుడైనా ఈ కింద ఇచ్చిన నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 30, 2023, 12:11 AM IST
Vizianagaram Train Accident Updates: 8 మంది మృతి.. 40 మందికిపైగా గాయాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!

Vizianagaram Train Accident Help Line Numbers: విజయనగరం జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు అలమండ-కంటకాపల్లి వద్ద నిలిచి ఉండగా.. వెనుక నుంచి విశాఖ-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో భీతవాహ వాతావరణం నెలకొంది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చీమ్మ చీకటి కమ్ముకుంది. NDRF, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ప్రమాదం జరిగిన చోటుకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సహాయం కోసం అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు చేశారు.

సమాచారం కోసం..

==> విశాఖ రైల్వే స్టేషన్‌లో హెల్ప్ లైన్ ఏర్పాటు.. 0891 2746330, 08912744619
==> ఎయిర్ టెల్: 81060 53051, 8106053052
==> బీఎస్ఎన్ఎల్: 8500041670, 8500041671
==> కలెక్టర్ కార్యాలయం: 94935 89157, 
==> రైల్వే కార్యాలయం: 89780 80006  

బాధితుల వైద్య సహాయార్థం విశాఖపట్టణం KGHలో హెల్ప్ లైన్ నంబర్స్ ఇవే.. 

==> కేజీహెచ్ casuality No.8912558494
==> Doctor at కేజీహెచ్ మొబైల్ No. 8341483151 (24 hrs available)
==> Doctor at కేజీహెచ్ casuality మొబైల్ No.8688321986 (24 hrs available)
==> బాధితుల వైద్య సహాయం కోసం పైన పేర్కొన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేయాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున కోరారు.

రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అటు నుంచి వస్తున్న రైళ్లను భువనేశ్వర్ వద్ద నిలిపివేయగా.. కోల్‌కతా వైపు వెళుతున్న రైళ్లను విశాఖపట్నంలో నిలిపివేశారు. ప్రమాదంలో స్థలంలో మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్‌పీ దీపికా పాటిల్‌ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. 

Also Read: Nagam Janardhan Reddy: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. నాగం జనార్థన్‌ రెడ్డి రాజీనామా  

Also Read: Virat Kohli: ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. విరాట్ కోహ్లీ డకౌట్.. వీడియో చూశారా..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News