6 Benefits of Green Chili: పచ్చిమిర్చి తింటే ఇట్టే మీ కొలెస్ట్రాల్‌ 15 రోజుల్లో కరగడం ఖాయం!

6 Health Benefits of Green Chili: స్పైసీగా ఉండే పచ్చిమిర్చిని ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2023, 09:57 PM IST
6 Benefits of Green Chili: పచ్చిమిర్చి తింటే ఇట్టే మీ కొలెస్ట్రాల్‌ 15 రోజుల్లో కరగడం ఖాయం!

6 Health Benefits of Green Chili: భారతీయులు ఎక్కువగా స్పైసి ఎక్కువగా ఉండే ఆహారాలను తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ప్రతి ఆహారం పచ్చిమిర్చి వినియోగిస్తూ ఉంటారు. ఆహారంలో ప్రతిరోజు పచ్చిమిర్చి వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చిమిర్చి లో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మిర్చి లో ఉండే గుణాలు శరీరానికి బోలెడు పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పచ్చిమిర్చిని ప్రతిరోజు వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ పచ్చిమిర్చిని తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్:
పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ శరీరంలోని కొలెస్ట్రాల్ ను సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా రక్తంలోని కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల వచ్చే అధిక రక్తపోటు నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునేవారు ప్రతిరోజు ఆహారంలో తప్పకుండా పచ్చిమిర్చిని వినియోగించాల్సి ఉంటుంది.

క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది:
ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే పరిశోధనల ప్రకారం.. ప్రతిరోజు పచ్చిమిర్చిని తీసుకునేవారిలో  క్యాన్సర్ ప్రమాదం 50 శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా క్యాన్సర్ రాకుండా కూడా పచ్చిమిర్చి శరీరాన్ని కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం:
చాలామందిలో తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా కొంతమంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసం పచ్చిమిర్చి ప్రభావంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ణాలు యాంటీ ఆక్సిడెంట్లు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

చర్మం ఆరోగ్యం కోసం..
పచ్చిమిర్చిలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా చేసేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మంపై ఉన్న మొటిమలు మచ్చలను తొలగించేందుకు కూడా సహాయపడుతుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
శీతాకాలంలో తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ఇలాంటివారు ప్రతిరోజు పచ్చిమిర్చిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి బాడీని ఉపశమనం కలిగిస్తాయి.

Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి:
చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతిరోజు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటివారు ప్రతిరోజు పచ్చిమిర్చితో కూడిన ఆహారాలకు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పచ్చిమిర్చిలో ఉండే గుణాలు జీవక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.

శరీర బరువును నియంత్రిస్తాయి:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఆహారంలో పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రిస్తాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించేది కూడా పచ్చిమిర్చి ప్రభావంతంగా సహాయపడుతుంది.

Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News