Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ఇంకా కొనసాగుతోంది. అదే సమయంలో అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతంలో కూడా ద్రోణి విస్తరించి ఉంది. ఫలితంగా రానున్న మూడ్రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచిస్తోంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొన్నటి వరకూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్ నెలలో అయితే ఒక్క వర్షం కూడా నమోదు కాని పరిస్థితి. గత 3 రోజులుగా వాతావరణంలో మార్పు వచ్చింది. రెండు రాష్ట్రాల్లోని పలుప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగుతుండటమే కాకుండా ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా ఉంది. అల్పపీడన ద్రోణికి ఈశాన్య రుతుపవనాలు తోడవడంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. దాంతో వర్షాల్లేక అల్లాడుతున్న రైతాంగానికి ఊరట కలిగింది. పంట పొలాలు తడవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ నుంచి పశ్చిమ బంగాళాఖాతం వరకూ విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి కారణంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో 3.25 సెంటీమీటర్లు, కూకట్ పల్లిలో 3, కొత్తగూడెం జిల్లా మద్దుకూరులో 10, యాదాద్రి భువనగిరిలో 7.6, లింగంపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గత 2-3 రోజులుగా ఏపీ, తెలంగాణలో వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా మేఘావృతమౌతూ భారీగా వర్షం దంచి కొడుతోంది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు తూర్పు ఆగ్నేయం నుంచి తెలంగాణవైపుకు వీస్తున్నాయి. అందుకే వాతావరణంలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. ద్రోణి ఇంకా కొనసాగుతున్నందున రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: Supreme Court: కొలీజియం సిఫార్సులకు కేంద్రం ఆమోదం, సుప్రీంకు మరో ముగ్గురు న్యాయమూర్తులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook