Tata SUV Cars: టాటా మోటార్స్ దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న కార్లలో మూడవ స్థానంలో ఉంది. ఎస్‌యూవీ విభాగంలో టాటా నెక్సాన్ , టాటా పంచ్ అన్నింటికంటే ఎక్కువగా విక్రయమౌతూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. టాటా పంచ్ అయితే స్వల్పకాలంలోనే క్రేజ్ సంపాదించుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టాటా మోటార్స్ ఎస్‌యూవీ విభాగంలో టాటా నెక్సాన్, టాటా పంచ్ విక్రయాలు గణనీయంగా ఉన్నాయి. టాటా పంచ్ లాంచ్ అయి ఇంకా రెండేళ్లు పూర్తి కాకుండానే మార్కెట్‌లో మంచి వాటా సాధించింది. అమ్మకాల్లో టాటా నెక్సాన్‌కే పోటీ ఇస్తోంది. ఎందుకంటే ఇటీవల అక్టోబర్ నెల విక్రయాల్లో టాటా నెక్సాన్ వర్సెస్ టాటా పంచ్ అమ్మకాల్లో పెద్ద తేడా లేదు. అక్టోబర్ 2023లో టాటా మొత్తం అమ్మకాల్లో నెక్సాన్ , పంచ్‌ల వాటానే ఎక్కువ. టాటా మోటార్స్ మొత్తం విక్రయాల్లో ఈ రెండు కార్లే 65 శాతం ఉన్నాయంటే ఆ కార్లకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. టాటా నెక్సాన్ మొత్తం 16,887 యూనిట్ల అమ్మకాలతో అత్యదిక విక్రయాలు జరిపిన కారుగా నిలించింది. ఇక టాటా పంచ్ అయితే అక్టోబర్ నెలలో మొత్తం 15, 317 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. అంటే మొన్న అక్టోబర్ నెల అమ్మకాల్లో ఈ రెండింటి మధ్య తేడా కేవలం 1570 మాత్రమే.
అక్టోబర్ నెలలో టాటా కార్ల అమ్మకాలు ఇలా
టాటా నెక్సాన్ 16,887 యూనిట్లుట
టాటా పంచ్ 15, 317 యూనిట్లు
టాటా టియాగో 5,356 యూనిట్లు
టాటా ఆల్ట్రోజ్ 5,984 యూనిట్లు
టాటా టిగోర్ 1563 యూనిట్లు
టాటా హ్యారియర్ 1896 యూనిట్లు
టాటా సఫారీ 1340 యూనిట్లు
టాటా నెక్సాన్ ధర 8.10 లక్షల నుంచి 15.50 లక్షల వరకూ ఉంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. ఇక టాటా పంచ్ 6 లక్షల నుంచి 9.52 లక్షల వరకూ ఉంది. అంటే టాటా నెక్సాన్ ప్రారంభధరకు మరో 1.40 లక్షలు చేర్చితే చాలు..టాటా పంచ్ టాప్ ఎండ్ వచ్చేస్తుంది. టాటా పంచ్ కంటే టాటా నెక్సాన్ కాస్త ఆధునిక ఎస్‌యూవీ.
Also read: Bank Holidays: ఈనెలలో బ్యాంకు పనులుంటే జాగ్రత్త, వరుసగా ఐదురోజులు నో బ్యాంక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook