Dhruva Natchathiram: విడుదలకు ఒక్కరోజు ముందు వాయిదా ప్రకటించిన గౌతమ్ మీనన్…విక్రమ్ సినిమాకి తప్పని కష్టాలు

Gautham Menon: ఎప్పుడో 2013 సంవత్సరంలో మొదలైన విక్రమ్ సినిమా ధ్రువ నాతిచరామి. ఈ సినిమా తెలుగులో ధ్రువ నక్షత్రం గా విడుదల చేయాలి అనుకున్నారు. కాగా ఇన్ని సంవత్సరాలకు ఈ సినిమా షూటింగ్ అయ్యి ఇక విడుదల చేద్దాం అనగా ఇప్పుడు మళ్ళీ వాయిదా పడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2023, 09:11 AM IST
Dhruva Natchathiram: విడుదలకు ఒక్కరోజు ముందు వాయిదా ప్రకటించిన గౌతమ్ మీనన్…విక్రమ్ సినిమాకి తప్పని కష్టాలు

Vikram: మనకున్న అత్యంత కొద్దిమంది గొప్ప హీరోల్లో విక్రమ్ ఒకరు. ఏ పాత్రనైనా అవలీలగా చేయగలరు ఈ హీరో. అంతేకాదు ఏదైనా పాత్ర ఒప్పుకుంటే దాని కోసం సర్వ విధాలా కష్టపడతారు. కానీ అలాంటి ఈ హీరోకి ప్రస్తుతం సూపర్ హిట్లు లేకపోవడం బాధాకరమైన విషయమే. కాగా తమిళ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా  దర్శకుడు గౌతమ్ మీనన్ కొద్ది సంవత్సరాల క్రితం విక్రంతో ఒక సినిమా మొదలుపెట్టారు. కొద్ది సంవత్సరాల క్రితం అంటే గత సంవత్సరం అనుకోకండి.. ఎప్పుడో 2013లో ‘ధ్రువ నక్షత్రం’ అనే చిత్రాన్ని మొదలుపెట్టారు. కానీ ఈ చిత్రానికి ఆది నుంచి అన్ని అడ్డంకులే. 

2013లో సూర్యతో మొదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి హీరో సూర్య ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మళ్లీ షూటింగ్ మొదలు అవ్వడానికి దాదాపు 3 సంవత్సరాల టైం తీసుకుంది. ఇక ఫైనల్ గా 2016లో హీరో విక్రమ్ తో ఈ సినిమా తీసి  2017 లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఏదో ఒక కారణం వల్ల ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. మరో విశేషం ఏమిటి అంటే ఈ చిత్రం రెండు భాగాలుగా దర్శకుడు తెరకెక్కించడం.

ఇక ఇప్పుడు 2023లో తాము పక్క వచ్చేస్తున్నామంటూ టీజర్ అండ్ ట్రైలర్స్ రిలీజ్ చేసి సందడి చేశారు. ఈ సినిమా మేకర్స్ చెప్పిన దాని ప్రకారం ఈరోజు అనగా నవంబర్ 24 ఈ చిత్రం విడుదల కావాలి. అయితే ఈరోజు తెల్లారి జామున 2:30 నిమిషాలకు కి.. సడన్ గా పోస్టుపోన్ చేస్తున్నట్లు గౌతమ్ మీనన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు. 

కాకా ఈసారి ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొన్ని సమస్యలు రావడంతో వాయిదా వేయడం జరిగిందట. ఇక ఈ చిత్రాన్ని సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మరో రెండు రోజులు సమయం పట్టేలా ఉంది అని గౌతమ్ మీనన్ తెలియజేశారు. ఇక ఇన్ని కష్టాలు పడి కూడా ఈ సినిమాని ఎలాగైనా ప్రేక్షకులకు చేర్చాలి అని ధృత సంకల్పంతో ఉన్న గౌతమ్ కి ధైర్యం చెబుతూ కింద కామెంట్లు పెడుతున్నారు నేటిజన్స్.

కాగా స్పై అండర్ కవర్ ఆపరేషన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రీతువర్మ, సిమ్రాన్,ఐశ్వర్య రాజేష్, రాధికా, అర్జున్ దాస్, పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించి అల్లరించనున్నారు.

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News