Chandrababu: సిద్ధార్ధ్ లూథ్రా కుమారుడి పెళ్లి వేడుకకు హాజరైన చంద్రబాబు

Chandrababu: సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా పేరు అందరికీ ఇటీవల బాగా పరిచయం. ఏపీ స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు తరపున వాదించడంతో పరిచయమైన కాస్ట్ లీ లాయర్. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2023, 07:48 AM IST
Chandrababu: సిద్ధార్ధ్ లూథ్రా కుమారుడి పెళ్లి వేడుకకు హాజరైన చంద్రబాబు

Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అదినేత చంద్రబాబు తరపున వాదించేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా. చంద్రబాబు కేసుతో తెలుగు రాష్ట్రాలకు పరిచయమైన వ్యక్తిగా మారారు. ఇప్పుడాయన కుమారుడి పెళ్లికి చంద్రబాబు హాజరైన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కుమారుడి పెళ్లికి సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. ఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబు తరపున వాదించిన న్యాయవాది అతనే. ఈ కేసుతోనే తెలుగు రాష్ట్రాలకు సిద్ధార్ధ్ లూథ్రా పేరు పరిచయమైంది. చాలా కాస్ట్ లీ లాయర్ అనే ప్రచారం సాగింది. రోజుకు ఫీజు కోట్లల్లో ఉంటుందనే వార్తలు విన్పించాయి. ఇప్పుడాయన కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి హాజరయ్యారు. సతీ సమేతంగా చంద్రబాబు తన కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు రావడం పట్ల సిద్ధార్ధ్ లూథ్రా హర్షం వ్యక్తం చేశారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ సైతం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఉప రాష్ట్రపతి జగదీప్ ధనకర్ కాస్సేపు ముచ్చటించుకున్నారు. 

ఈ వేడుక కోసం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు దంపతులకు టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామ కృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడులు ఆహ్వానం పలికారు. స్కిల్ కుంభకోణం కేసులో రెగ్యులర్ బెయిల్ పొందిన తరువాత చంద్రబాబు తొలి పర్యటన ఇదే. మరోవైపు రెగ్యులర్ బెయిల్ రద్దు పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నవంబర్ 20న ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్‌ను సవాలు చేస్తూ నవంబర్ 21న సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాక్ష్యాధారాలు సమర్పించినా తమ వాదనను పరిగణలో తీసుకోలేదని , హైకోర్టు ఈ విషయంలో పరిధి దాటి వ్యవహరించిందని సీఐడీ ఆరోపించింది.

సిద్ధార్ధ్ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు హాజరైన చంద్రబాబు ఫోటోల్ని తెలుగుదగేశం పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Also read: New Visa Rules: భారతీయ విద్యార్ధుల అమెరికా వీసా నిబందనల్లో మార్పులు, ఇవాళ్టి నుంచే అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News