Actor and Sportsman Arvind Krishna: సినీ నటులకు సినిమాలతో సమయం సరిపోతుంది. సినిమాల తప్పా వాళ్లకు మరో ధ్యాస ఉండదు. ఎప్పుడు కెమెరా, యాక్షన్, కట్ పదాలు వింటూనే షూటింగ్స్‌తో బిజీగా ఉంటారు. టాలీవుడ్ సెలబ్రిటీలు అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్‌లతో అలరిస్తుంటారు. తాజాగా ఓ టాలీవుడ్ యంగ్ హీరోగా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో బాస్కెట్ బాల్ ఆటలో రఫ్ఫాడిస్తున్నాడు. అరవింద్ కృష్ణ అనే హీరో.. బాస్కెట్ బాల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అరవింద్ కృష్ణ ప్రస్తుతం ఓ సూపర్ హీరో మూవీలో నటిస్తున్నాడు.
ఈ మూవీని భారీగా ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంటున్న అరవింద్ కృష్ణ.. షెడ్యూల్ బ్రేక్స్‌లో ది ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ (FIBA) లీగ్‌లో ఆడుతున్నాడు. క్రికెట్లో ఐపీఎల్ టీ20 మాదిరి బాస్కెట్లో బాల్లో 3BL లీగ్ ఉంటుంది. FIBA జపాన్‌లో గత వారం నిర్వహించింది. ఇందులో ఒక్కో టీమ్ నుంచి ముగ్గురు బాస్కెట్ బాల్ ప్లేయర్లు ఆడాల్సి ఉంటుంది. ఒకరు సబ్‌స్టిట్యూట్‌గా ఉంటారు. ఇందులో హైదరాబాద్ పాల్గొనగా.. ఆ జట్టుకు అరవింద్ కృష్ణ కెప్టెన్‌గా వ్యవహరించారు. బల్లా కొయటె, టకహారు సౌగవా, మయొరి వంటి దేశాల నుంచి కూడా జట్లు ఈ లీగ్‌లో ఆడాయి. అరవింద్ కృష్ణ జట్టు మంచి ఆటతీరు కనబర్చి.. క్వాలిఫైయర్స్‌కు ఎంపికైంది. ఈ లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లను వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. 3BL లీగ్‌లో భారత్ నుంచి పాల్గొన్న ఏకైక ఆటగాడు కూడా అరవింద్ కృష్ణనే.
ఈ సందర్భంగా అరవింద్ కృష్ట మాట్లాడుతూ.. క్రికెట్లో పొట్టి క్రికెట్ ఐపీఎల్ తరహాలో బాస్కెట్ బాల్లో 3BL లీగ్‌ను నిర్వహిస్తున్నారని తెలిపాడు. ఇందులో ముగ్గురు ఆటగాళ్లతో పాటు ఓ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఉంటాడని చెప్పాడు. ఇలాంటి గొప్ప ఛాంపియన్‌షిప్‌లో మన జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నాడు. తాను సినిమాలతో బిజీ ఉంటున్న తరుణంలో 3BL లీగ్‌లో పాల్గొనటం తనకు మంచి బ్రేక్‌లా ఉంటుందన్నాడు. ఇది ఎంతో ఉత్సాహన్నిస్తుందన్నాడు. ఓ వైపు ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా రాణిస్తునే.. మరో వైపు సినిమాలతో బిజీగా ఉంటునే రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. తన స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్, తన పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు అరవింద్.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
Also Read: Viral News: దిమిలి గ్రామంలో జరిగే బురద జాతర ప్రత్యేకత..ఈ జాతర వెనుక ఉన్న పెద్ద సైన్స్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి