Chhattisgarh: అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో వచ్చింది. అయితే గత వారం రోజులుగా ముఖ్యమంత్రి ఎవరో బీజేపీ అధిష్టానం తేల్చలేకపోయింది. ఇప్పుడీ సస్పెన్స్‌కు తెరపడింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను కాదని కొత్త వ్యక్తిని ఎంచుకుంది.
వారం రోజుల చర్చల అనంతరం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎవరనేది తేలింది. రాష్ట్రంలోని కుంకురీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన 59 ఏళ్ల విష్ణుదేవ్ సాయ్‌కు బీజేపీ అధిష్టానం పట్టం కట్టింది. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌ను కాదని విష్ణుదేవ్ సాయ్‌ను శాసనసభా పక్షనేతగా ఎన్నుకున్నారు. గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పని చేయడమే కాకుండా మోదీ తొలి కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరించారు. కేంద్రమంత్రులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్, రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ ఓమ్ మాధుర్, కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవియాల నేతృత్వంలో బీజేపీ శాసనసభా పక్షనేతగా విష్ణుదేవ్ సాయ్ ఎన్నికయ్యారు. ఈయన ప్రాతినిద్యం వహిస్తున్న సుర్గుజా ప్రాంతంలోని మొత్తం 14 స్థానాల్ని బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది.
విష్ణుదేవ్ సాయ్ నాలుగు సార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 54 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలకు పరిమితమైంది. విష్ణుదేవ్ సాయ్ రాజకీయ జీవితం సర్పంచ్‌గా ప్రారంభమై ముఖ్యమంత్రి వరకూ సాగింది. 1999, 2004, 2009, 2014లో రాయ్‌గడ్ ఎంపీగా గెలిచారు.
#WATCH | Raipur: BJP leader Vishnu Deo Sai to become the next Chief Minister of Chhattisgarh. pic.twitter.com/PtAOM52JKa
— ANI (@ANI) December 10, 2023
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులు కాగా,అరుణ్ సావో, విజయ్ శర్మలను డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం.
Also read: Ysr Aarogyasri: ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ కీలక నిర్ణయం, పరిమితి 25 లక్షలకు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌పై తొలగిన సస్పెన్స్, ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్