Highest Grossing Movies 2023: 2023 కి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరం 2024 కి వెల్కమ్ చెప్పాల్సిన టైం రానే వచ్చింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్ లో బోలెడు సినిమాలు విడుదల అయ్యాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించాయి. మరి 2023 లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన కొన్ని తెలుగు సినిమాలు ఏంటో చూద్దాం..
1. ఆది పురుష్: రామాయణం ఆధారంగా ప్రభాస్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం కొంత వరకు నెగటివ్ రెస్పాన్స్ అందుకుంది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించి ఈ ఏడాది ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసిన మొట్ట మొదటి తెలుగు సినిమా గా నిలిచింది.
2. వాల్తేరు వీరయ్య : సంక్రాంతి సందర్భంగా 2023 మొదట్లోనే విడుదల అయిన ఈ చిత్రం ఈ జాబితా లో రెండవ స్థానం లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి కి రీ ఎంట్రీ తర్వాత వచ్చిన మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఇదే.
3. వీర సింహా రెడ్డి : నందమూరి బాలకృష్ణ హీరోగా సంక్రాంతి బరి లోనే దిగిన ఈ చిత్రం అఖండ తర్వాత మరొక సూపర్ హిట్ గా బాలయ్య కెరీర్ లో నిలిచింది.
4. దసరా : న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన దసరా సినిమా లో నాని ఇప్పటిదాకా ఎప్పుడు కనిపించనటువంటి రస్టిక్ పాత్రలో కనిపించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో విడుదల అయిన ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది.
5. బ్రో : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా రీమేక్ సినిమా అయినప్పటికీ మంచి విజయాన్ని సాధించింది.
6. భగవంత్ కేసరి: 2023 లో బాలయ్య హీరో గా విడుదల అయిన రెండవ సినిమా గా మాత్రమే కాక అఖండ, వీర సింహా రెడ్డి సినిమాల తర్వాత బాలయ్య కి హ్యాట్రిక్ ఇచ్చిన సినిమా గా కూడా భగవంత్ కేసరి గురించి చెప్పుకోవచ్చు.
7. విరూపాక్ష : ఈ జాబితా లో ఉన్న మరొక మెగా హీరో సినిమా విరూపాక్ష. చాలా కాలం తర్వాత సాయి ధరమ్ తేజ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతోంది.
Also Read: WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి