Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth: పట్టుదలతో పోరాడితే విజయం తప్పకుండా వరిస్తుందని నిరూపించాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగి విజేతగా నిలిచాడు. తనను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపిచాలని ఎంతోమందిని వేడుకున్నాడు. “అన్నా మళ్లొచ్చినా.. తెలుసు కదా మళ్లొచ్చినా అంటే తగ్గేదేలే.. నన్ను బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తానన్నా.. నేను రైతు బిడ్డను అన్నా.. నన్ను బిగ్ బాస్‌లోకి తీసుకోండి అన్నా.. ఈ వీడియో నాగార్జున వరకు చేరేలా షేర్ చేయండి అన్నా..” అంటూ కొన్ని వందల వీడియోలు చేసి.. చివరకు తాను కోరుకున్నట్లుగానే రైతు బిడ్డగా బిగ్ బాస్ ఛాన్స్ దక్కించుకున్నాడు. సామాన్యుడిగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన ఆటతీరుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
తన ఫోన్‌ను ఆయుధంగా మార్చుకుని వీడియోలు చేశాడు. తన తండ్రి ఎంతో కష్టపడి సంపాదించి ఇచ్చిన డబ్బులతో ఐఫోన్ కొనుక్కున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లితీరుతానని శపథం చేసి తనను ట్రోల్స్ చేస్తున్న వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఎంతోమంది హేళన చేసినా వెనక్కి తగ్గలేదు. హైదరాబాద్‌లో ఎన్నో రోజులు పస్తులు ఉంటూ.. బిగ్ బాస్ షోలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశాడు. చివరకు తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి పిలుపు వచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందుకున్న పల్లవి ప్రశాంత్.. చివరకు బిగ్ బాస్ విజేతగా నిలిచి శభాష్ అనిపించుకున్నాడు. తాను రైతుల కోసం ఆడుతున్నానని.. అన్నదాత కష్టాలు అందరికీ తెలియాలని ఆటలో ఎన్నోసార్లు చెప్పాడు.
తన ఆట తీరు, మాట తీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్.. విజేతగా నిలిచిన అనంతరం చేసిన ప్రకటనంతో అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్‌కు రూ.35 లక్షల చెక్, మారుతీ సుజుకీ హాట్ అండ్ టెకీ బ్రెజ్జా SUV కారు, రూ.15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ బహుమతిగా లభించాయి. తనకు వచ్చిన రూ.35 లక్షలు మొత్తం ప్రైజ్ మనీని రైతులకే ఇస్తానని స్టేజీ మీద ప్రకటించి తన మంచి మనసు చాటుకున్నాడు. ఒక రైతుగా అన్నదాతల కష్టాలు తెలుసు కాబట్టి.. ఆ డబ్బులు మొత్తం వాళ్లకే ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇక కారును తన తండ్రికి ఇస్తానని.. నెక్లెస్‌ను అమ్మకు ఇస్తానన్నాడు.
ట్రోఫీ అందుకున్న అనంతరం పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. తాను చెప్పినట్లే.. రూ.35 లక్షలు రైతులకు ఇస్తానని తెలిపాడు. కష్టాల్లో ఉన్న రైతులకు ప్రతి రూపాయిని తానే దగ్గర ఉండి పంచుతానని చెప్పాడు. ఇందులో మాట తప్పేదే లేదని.. జై జవాన్.. జై కిసాన్ అని అన్నాడు. తాను రైతుల కోసమే వచ్చానని.. రైతుల కోసమే ఆడినట్లు చెప్పుకొచ్చాడు. మళ్లొచ్చినా అంటే తగ్గేదే లే అంటూ తన స్టైల్‌తో స్పీచ్‌ను ముగించాడు పల్లవి ప్రశాంత్.
Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి