Dawood Ibrahim: ఇండియాస్ మెస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందనే వార్త సంచలనం రేపుతోంది. పాకిస్తాన్లో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగంతో పరిస్థితి విషమించిందని, ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స అందిస్తున్నాట్టు సమాచారం.
ముంబై మాఫియా డాన్‌గా ఎదిగిన దావూద్ ఇబ్రహీం తనకంటూ నేర ప్రపంచం ఏర్పర్చుకున్నాడు. ఏళ్ల తరబడి ముంబై చీకటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. 1993 ముంబై పేలుళ్లలో ప్రధాన కుట్రదారుడు. ఈ పేలుళ్లలో 257 మంది మరణించగా 1500 మంది గాయాలపాలయ్యారు. వందల కోట్ల ఆస్థినష్టం సంభవించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి దావూద్ ఇబ్రహీంగా పోలీసులు తేల్చారు. అప్పట్నించి పాకిస్తాన్లో తలదాచుకుంటూ అక్కడే ఉంటున్నాడు.
దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందనే వార్తను అధికారికంగా ఇంకా ఎవరూ ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. విష ప్రయోగం తరువాత అతని పరిస్థితి విషమించడంతో ఆసుపత్రితో చేర్చినట్టు తెలుస్తోంది. దావూద్‌కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి బయట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మొత్తం ఫ్లోర్ అంతటికీ దావూద్ ఒక్కడే పేషెంట్‌గా ఉన్నాడు. ఆ ఫ్లోర్‌కు చేరేందుకు పోలీసు ఉన్నతాధికారులు, సన్నిహత కుటుంబీకులకు మాత్రమే అనుమతి ఉందని సమాచారం.
దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందనే వార్త హల్చల్ చేస్తోంది. పాకిస్తాన్లో ఇంటర్నెట్ సర్వర్లు సైతం డౌన్ అయ్యాయని సమాచారం. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయింది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పనిచేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ గవర్నెన్స్‌ను పర్యవేక్షించే సంస్థ నెట్బ్లాక్ అయితే పాకిస్తాన్లో మీడియా సంస్థలపై నిషేధముందని ధృవీకరించింది.
దావూద్ ఇబ్రహీంకు ఎవరో విషం ఇవ్వడంతో అతని ఆరోగ్యం విషమించిందని, కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ ఆర్జూ కాజ్మీ తెలిపారు. అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదు గానీ ఎదో జరగానికి జరిగినట్టే అర్ధమౌతోందని చెప్పారు. బహుశా అందుకే పాకిస్తాన్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ సర్వర్ డౌన్ చేశారని చెప్పుకొచ్చారు.
Also read: Covid-19: సింగపూర్‌లో భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు... ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook