Aquarius Horoscope 2024: కుంభ రాశి జాతకులకు 2024 ఎలా ఉంటుందో తెలుసుకుందాం. గత ఏడాది 2023తో పోలిస్తే ఈసారి బాగుంటుందని అంచనా. ముఖ్యంగా పాత సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. ఈ ఏడాదిలో అన్ని రకాల ఆనందాలు లభిస్తాయంటున్నారు జ్యోతిష్యులు.
కుంభ రాశి జాతకులకు కొత్త సంవత్సరం 2024 లో విదేశీ ప్రయాణ యోగం ఉండవచ్చు. కొత్త ఇళ్లు, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. కొత్త ఏడాదిలో ఫిబ్రవరి నుంచి మార్చ్ మధ్యలో విదేశీ యానం ఉంటుందంటున్నారు. జనవరి నెలలో ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో మీరు చేపట్టిన పనులు విజయవంతం కావడంతో మంచి పదవులు లభిస్తాయి. ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. ఏడాది చివర్లో కూడా లాభాలు కలగనున్నాయి.
వ్యాపారులకైతే కొత్త ఏడాది చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసే వ్యాపారం కాకుండా కొత్త వ్యాపారంలోకి మారవచ్చు. లేదా కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. ఏప్రిల్ నుంచి జూలై వరకూ ఈ మార్పు ఉండే అవకాశముంది. ఏప్రిల్ నెలలో అయితే ఊహించని లాభాలు కలగనున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అంతగా బాగుండదు. అప్రమత్తంగా ఉండాలి. ఇక జనవరి నెల అయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆస్థి కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకూ అంత అనుకూలమైన సమయం కాదంటున్నారు. ఈ సమయంలో ఆస్థి లేదా వాహనం కొనుగోలు వంటి విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఒకవేళ వాహనం లేదా ఇళ్లు కొనుగోలు చేయాలంటే మే 19 నుంచి జూన్ 12 మధ్య కాలం అన్ని విధాలుగా మంచిది.
కుంభ రాశి జాతకులకు కొత్త ఏడాదిలో ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆరోగ్య పరిస్తితి పటిష్టంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు. ఫిబ్రవరి నుంచి మార్చ్ మధ్యకాలంలో కాస్త ఎత్తుపల్లాలుంటాయి. జాగ్ర్తత్తగా ఉండాలి. ఏప్రిల్ నుంచి మాత్రం పరిస్థితి మారవచ్చు. కొత్త ఏడాదిలో ఖర్చులు కూడా పెరగనున్నాయి.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా కొత్త ఏడాది 2024లో ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు. కుంభ రాశి అధిపతి శని మీ రాశిలో ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటి పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే చాలా వరకూ అనుకూల పరిణామాలే ఉంటాయి. అదే సమయంలో కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. సోదర సోదరీమణుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. మే 1 నుంచి కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో తండ్రి అనారోగ్యం బాధించవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
Also read: Vakri Budh 2023: తిరోగమనంలో బుధుడు... ఇక ఈ మూడు రాశులకు కష్టాలు షురూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook