Prasanth Varma Tweet: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన చిత్రం హనుమాన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతో పోటీకి దిగిన ఈ సినిమా.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని.. మహేష్ బాబు సినిమాని సైతం కలెక్షన్స్ పరంగా దాటేసింది.
బుక్ మై షో లో కూడా ఈ చిత్రానికి ఏకంగా 50k మంది పైగా యూజర్లు 9.6 రేటింగ్ ఇచ్చి సంక్రాంతి సినిమాలల్లో విన్నర్ గా నిలబెట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్ర దర్శకులు పెట్టిన ఒక ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
ప్రశాంత్ వర్మ తనకు మూడు రోజుల నుంచి బాగా జ్వరంగా ఉందని.. అందుకే అందరి కాల్స్.. మెసేజెస్ తాను ఎత్తడం లేదని.. ఒక్కసారి తనకు ఆరోగ్యం బాగా అయ్యాక అందరికీ జవాబులు ఇస్తానని…అందరికీ తన క్షమాపణలు అంటూ ఒక ట్వీట్ వేశారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
I’m suffering from high fever since last three days 🤒. Sorry I missed all your calls and messages 🙏🏽. I will respond to each and every person as soon as I feel better! 🤗
— Prasanth Varma (@PrasanthVarma) January 13, 2024
ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకి వరసగా మెసేజీలు, కాల్స్ వస్తున్నాయట. కానీ తన ఆరోగ్యం వల్ల అతను ఎవరికీ రిప్లై ఇవ్వలేదట. ప్రశాంత్ వర్మ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అందరూ అనుకునే లోపే ఈ ట్వీట్ షేర్ చేశారు దర్శకుడు. మొత్తానికి ప్రశాంత్ వర్మ జ్వరం అనే సమస్యతో బాధపడుతూ ఉండటం వల్ల అందరికీ రిప్లైలు ఇవ్వడం లేదని అర్థమైంది.
కాగా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజే ఈ సినిమా రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతం గుంటూరు కారం కంటే హనుమాన్‌కు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 11వ తేదీన ప్రదర్శించిన ప్రీమియర్లకు సుమారుగా 4.20 కోట్ల రూపాయలు వసూలు చెయ్యక.. మొదటి రోజు 9 కోట్లకుపైగా షేర్ సాధించింది. తెలుగులో 6 కోట్లు, హిందీలో 2.6 కోట్లు, తమిళంలో 30 లక్షలు, కన్నడలో 80 లక్షలు, మలయాళంలో 10 లక్షల రూపాయల షేర్ సాధించింది. దాంతో ఇండియాలో 9 కోట్ల రూపాయల షేర్, 18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దాంతో ప్రీమియర్లతో కలిపి 13 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్‌లో 7 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 21 కోట్లు వసూలు చేసింది.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook