New Bat Virus: ప్రపంచ మానవాళిని వివిద రకాల వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి. మరో కొత్త ప్రాణాంతక వైరస్ వెలుగుచూడటంతో ఆందోళన వ్యక్తమౌతోంది. గబ్బిలాల్లో గుర్తించిన ఈ వైరస్ మనుషులకు సోకే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచాన్ని దాదాపు రెండున్నరేళ్లు గజగజలాడించిన కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వ్యాపించిందనే వివాదం రేగింది. చైనా ఈ ఆరోపణల్ని కొట్టిపారేసినా ప్రపంచం ఇప్పటికీ చైనా వైపే వేలు చూపిస్తోంది. అయితే ఎకోహెల్త్ సంస్థ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. ఇప్పుడీ ఎకోహెల్త్ అలయన్స్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ బేటీలో సంచలన విషయాలు వెల్లడించింది. థాయ్‌లాండ్‌లో కొత్త వైరస్ గుర్తించామని..ఇది గబ్బిలాల్లో పుట్టుకొచ్చిందని ఎకో హెల్త్ వెల్లడించింది. ఈ ప్రాణాంతక వైరస్ మనుషులకు వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వైరస్ చూడలేదని ఆ సంస్థ పరిశోధకుడు డాక్టర్ పీటర్ తెలిపారు. థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో ఈ వైరస్ గుర్తించినట్టు చెప్పారు. కరోనా వైరస్ స్థాయిలో వ్యాపించే సామర్ధ్యం ఈ కొత్త వైరస్ కు ఉందని డాక్టర్ పీటర్ హెచ్చరించారు. స్థానికంగా ఉన్న రైతులు ఈ గుహలో ఉన్న గబ్బిలాల ఎరువుల్ని పంట పొలాలకు ఉపయోగిస్తున్నారని..ఆ ఎరువులోనే కొత్త వైరస్ ఉందని చెప్పారు. మనుషులు ఈ వైరస్‌తో కాంటాక్ట్‌లో వస్తున్నందున అత్యవసర పరిస్థితులకు దారి తీయవచ్చని హెచ్చరించారు.
ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ప్రపంచంలోని పలు దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. డిసెంబర్ నెలలో సైతం ప్రపంచవ్యాప్తంగా 10 వేలమంది చనిపోయారు. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధితో ప్రపంచం భయపడుతుంటే థాయ్‌లాండ్ కొత్త వైరస్ కలకలం రేపుతోంది.
Also read: Nepal Bus Accident: నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరు భారతీయులతో సహా 12 మంది దుర్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook