Benefits Of Eating Jaggery After Meal: ఆరోగ్య నిపుణుల ప్రకారం బెల్లంలో ఐరన్, కాల్షియం వంటీ పోషకాలు అధికంగా లభిస్తాయి. దీనిని ఆహారం తీసుకున్న తర్వాత తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆహారం తిన్న తర్వాత బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
⤷ బెల్లం తినడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
⤷ అహారం తీసుకున్న తర్వాత బెల్లం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
⤷ బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో ఏంతో సహాయపడుతుంది.
⤷ అంతేకాకుండా బెల్లంలోని ఐరన్ కీళ్ల సమస్యల, ఎముకల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
⤷ ప్రమాదకరమైన టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
Also read: Diabetic Diet Tips: మీకు డయాబెటిస్ ఉందా, అయితే ఈ 5 పదార్ధాలకు దూరం తప్పదు
⤷ రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారు ఈ బెల్లం తినడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.
⤷ నీరసం, బలహీనత వంటి లక్షణాలు కనిపించినప్పుడు చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.
⤷ చెవి నొప్పి సమస్యతో బాధపడుతున్నవారు బెల్లాన్ని నెయ్యితో కలిపి తినడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు.
ఈ విధంగా బెల్లం ఆహారం తర్వాత తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఆహారం తిన్న తర్వాత బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also read: Cucumber: దోసకాయ మజ్జిగ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter