Osmania University: అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్‌లో దూరిన ఆగంతకులు.. బాత్రూమ్ అద్దాలు పగలగొట్టి..

Osmania University Girls Hostel: సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో ముగ్గురు ఆగంతకులు దూరి కలకలం సృష్టించారు. బాత్రూమ్ అద్దాలు పగలగొట్టి లోపలకి చొరబడి.. అమ్మాయిలపై దాడికి ప్రయత్నించారు. అమ్మాయిలు ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 27, 2024, 02:50 PM IST
Osmania University: అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్‌లో దూరిన ఆగంతకులు.. బాత్రూమ్ అద్దాలు పగలగొట్టి..

Osmania University Girls Hostel: సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో కలకలం రేగింది. అర్ధరాత్రి వేళ ముగ్గురు ఆగంతకులు అమ్మాయిల హాస్టల్‌లోకి చొరబడ్డారు. బాత్రూం కిటికీ పగలకొట్టి లోపలికి చొరబడి.. విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. గమనించిన అమ్మాయిలు.. వెంటనే అప్రమత్తమై ఒకరిని పట్టుకున్నారు. చున్నీతో కట్టేసి అనంతరం పోలీసులకు ఫోన్ చేసి అప్పగించారు. హాస్టల్‌లోకి దూరిన మరో ఇద్దరు ఆగంతకుడు తప్పించుకుని పారిపోయాడు. హాస్టల్లో తమకు రక్షణ కరవైందని.. సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News