Mirror vastu: ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

Mirror vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. వాస్తు నియమాలు అనుసరించే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఈరోజు వాస్తు ప్రకారం అద్దాన్ని ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం.   

Written by - Renuka Godugu | Last Updated : Jan 27, 2024, 04:03 PM IST
Mirror vastu: ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

Mirror vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. వాస్తు నియమాలు అనుసరించే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ఈరోజు వాస్తు ప్రకారం అద్దాన్ని ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం అద్దం తప్పు దిశలో ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో వారిని సమస్యల వలయాలు చుట్టుముడతాయి. ఇంటికి నెగిటివిటీ ప్రభావం కూడా పెరిగిపోతుంది. 

1. వాస్తు ప్రకారం ఇంట్లో అద్దాలకు కూడా ప్రత్యేక దిశ ఉంది. అద్దాలు ఇంట్లో పెట్టుకునేటప్పుడు రెండు అద్దాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు. ఇలా ఉంటే ఆ ఇంట్లో అశాంతికి ఆస్కారం ఉంటుంది. వాస్తు ప్రకారం అద్దం బెడ్ రూంలో కూడా ఏర్పాటు చేయకూడదు. . 

2. అంతేకాదు ఇంటి వంటగదిలో అద్దం పెట్టకూడదు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం ఈ దిశ సరైంది కాదు.

౩. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద అద్దం ఏర్పాటు చేసుకోకూడదు. వాస్తు ప్రకారం అద్దం ఇంటి తూర్పు దిశలో పెట్టడం మంచిది . సాధారణంగా తూర్పు సూర్యభగవాణుని సూచిస్తుంది. అంతేకాదు వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య గోడపై అమర్చిన అద్దం పురోగతిని సూచిస్తుంది.. 

ఇదీ చదవండి: Name Astrology: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..

4. ఒకవేళ పొరపాటున అద్దం బెడ్ రూంలో ఉంచాల్సి వస్తే పడుకునే ముందు దాన్ని గుడ్డతో కప్పండి. అద్దంలో మంచం ప్రతిబింబించకుండా జాగ్రత్తలు తీసుకోండి. 

5. వాస్తు ప్రకారం ఇంట్లో పగిలిన అద్దాలు, విరిగిన ఫర్నిచర్ కూడా ఉంచకూడదు. వీటిద్వారా ఆ ఇంట్లో నెగిటివిటీ ప్రసరిస్తుంది. ఎందుకంటే పగిలిన అద్దం ఉదయం లేవగానే చూస్తాం. దీంతో అశుభం..

ఇదీ చదవండి: సంకటహర చతుర్దశిరోజు ఈ రెమిడీ చేయండి.. మీ పిల్లలకు పట్టిన దోషాలు తొలగిపోతాయి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News