Vastu Tips For Home: ఇంటివంటగదిలో కర్పూరం కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నమ్మలేరు ఓసారి చదవండి..

Camphor vastu Tips: ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించకున్నా.. గ్రహదోషాలు ఆ ఇంటి వ్యక్తిని పట్టిపీడిస్తున్నా.. ఆ ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. 

Written by - Renuka Godugu | Last Updated : Jan 28, 2024, 01:17 PM IST
Vastu Tips For Home: ఇంటివంటగదిలో కర్పూరం కాలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నమ్మలేరు ఓసారి చదవండి..

Camphor vastu Tips: ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించకున్నా.. గ్రహదోషాలు ఆ ఇంటి వ్యక్తిని పట్టిపీడిస్తున్నా.. ఆ ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం కొన్ని రెమిడీలు ప్రయత్నిస్తే వాస్తు దోషాలు తొలగించుకోవచ్చు. ఈరోజు మనం కర్పూరంతో వాస్తు దోష నివారణ ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం..

1. ఇల్లును వాస్తు ప్రకారం నిర్మించుకుంటాం. ఇంటి మాస్టర్ బెడ్ రూం, టాయిలేట్, కిచెన్, హాల్ వంటివి వాస్తు ప్రకారం నిర్ధేశించిన దిశలోనే నిర్మాణం చెపడతారు. అయితే, ఇంటి వంటగదిలో కర్పూరం కాల్చడం వల్ల ఆ ఇంటికి ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

2. ప్రతి మనిషికి ఇల్లు స్వర్గంలాంటిది. ఆ ఇల్లు వాస్తు దోషాలతో ఉంటే నరకంలా కనిపిస్తుంది. అందుకే కొన్ని ఇలాంటి వాస్తు రెమిడీలు ప్రయత్నించాలి. సాధారణంగా వంటగదిలోనే మనకు కావాల్సిన ఆహారం వండుకుంటాం. ఇంటి వాస్తు వంటగదిపై కూడా ఆధారపడి ఉంటుంది. రాత్రి పడుకునే సమయంలో వంటగదిలో కర్పూరం కాలిస్తే దరిద్రం తొలగిపోతుంది. కర్పూరాన్ని కాల్చడం వల్ల వంటగదిలో కాల్చడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

3. అంతేకాదు, ఇలా కర్పూరం వంటగదిలో కాల్చే ముందు ఇంటి కిచెన్లో ఆహారపదార్థాలు వండిన పాత్రలను శుభ్రంగా రాత్రి కడిగేసుకోవాలి. ఆ తర్వాత కిచెన్లో కర్పూరం కాల్చండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఆ ఇంటివారు బయట పడతారు.  

4. వాస్తుదోషం ఉన్న ఇంట్లోవారి ఆరోగ్యం కూడా బాగుండదు. తరచూ అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఈ కర్పూరం రెమిడీతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

ఇదీ చదవండి: Spirutual: జీడిపప్పును ఈ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే.. మీకోరికలు త్వరగా నెరవేరి దరిద్రం తొలగిపోతుందట..!
5. వంటగదిలోని అగ్ని మూలకం ఇక్కడ ప్రతికూల శక్తులు స్థిరపడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో నెగిటివిటీ పెరిగిపోతుంది. అప్పుడు లవంగాలతో కలిపి కర్పూరాన్ని కాల్చాలి. ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది. నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది.  

6. పంచభూతాలను నియంత్రంచడానికి ప్రతిరోజూ సాయంత్రం మీ ఇంటి వంటగదిలో కర్పూరం, లవంగాలతో కలిపి కాల్చండి. ఆ ఇంటి వాతావరణం కూడా పాజిటివ్ ఎనర్జీతో ఆహ్లాదకరంగా మారుతుంది.   

7. అంతేకాదు, వాస్తు ప్రకారం ఇంట్లో కర్పూరాన్ని కాల్చడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవానికి, కర్పూరాన్ని కాల్చడం ద్వారా విడుదలయ్యే పొగ వంటగదిలో సానుకూలత ,శాంతిని సృష్టిస్తుంది.(Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)

ఇదీ చదవండి: Sankatahara Chathurthi 2024: 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 4 రాశులవారు నక్కతోకతొక్కినట్టే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News