RaviTeja: రవితేజ వల్లే మాకు హీరోయిన్ల ఇబ్బంది.. తేజ సజ్జ వ్యాఖ్యలు వైరల్..

Eagle: హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించారు హీరో తేజ సజ్జ. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు దాదాపు 250 కోట్ల కలెక్షన్ సంపాదించి ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ హీరో రవితేజ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2024, 06:34 PM IST
RaviTeja: రవితేజ వల్లే మాకు హీరోయిన్ల ఇబ్బంది.. తేజ సజ్జ వ్యాఖ్యలు వైరల్..

Teja Sajja Interview With Ravi Teja: సంక్రాంతికి ఈ సంవత్సరం కూడా ఎన్నో సినిమాలు పోటి పడ్డాయి. అయితే సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన రవితేజ ఈగల్ సినిమా మాత్రం పోస్ట్ పోన్ అయ్యింది. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగా సినిమాలు సంక్రాంతికి థియేటర్స్ పంచుకోగా రవితేజ ఈగల్ చిత్రం విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసుకుంది. 

ఇక ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అన్నిటికన్నా తేజ హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిగతా చిత్రాలు అన్నీ మిక్స్ రెస్పాన్స్ అంతం చేసుకోగా హనుమాన్ మాత్రం సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుని ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర హీరో తేజ ఈగల్ సినిమా హీరో రవితేజ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

రవితేజ ‘ఈగల్’ సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరిలో రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది సినిమా యూనిట్.. ఈ నేపథ్యంలో తేజ సజ్జ హోస్టుగా రవితేజతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఇక ఇంటర్వ్యూలో తేజ సజ్జ మాట్లాడుతూ.. రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

అసలు విషయానికి వస్తే ప్రస్తుతం రవితేజ నటిస్తున్న దాదాపు అన్ని సినిమాలలో ఇద్దరి నుంచి నలుగురి వరకు హీరోయిన్స్ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న హీరోల చిత్రాలకి హీరోయిన్స్ దొరకాలంటే కష్టం అవుతుందట. ఎవరైనా సినిమా కోసం సంప్రదిస్తుంటే.. “ప్రస్తుతం రవితేజ గారి సినిమా చేస్తున్నాను. అది పూర్తీ అయిన తరువాత మీ సినిమా చేస్తాను” అంటూ చెబుతున్నారట. తేజ సజ్జ కూడా తన సినిమా విషయంలో ఇది ఫేస్ చేశారట. ఈ విషయం గురించే తేజ సజ్జ.. ఇంటర్వ్యూలో మాట్లాడారు. “మీరు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ని ఈ సినిమాలకు తీసుకొని మా యువ హీరోలను ఇబ్బందులు పెడుతున్నారు”.. అంటూ తేజ సజ్జ, రవితేజ పై ఫన్నీ కామెంట్స్ చేశారు.

ఇప్పుడు కూడా ఈ ఈగల్ సినిమాలో కావ్య తాపర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంటే, అనుపమ పరమేశ్వరన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: Niharika Vs Chaitanya: నిహారిక ఇంటర్యూపై మాజీ భర్త చైతన్య స్పందన.. తనను నిందించొద్దని హితవు

Also Read:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News