Family Pension Rules: మహిళా ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన జారీ చేసింది. ఇక నుంచి మహిళలు తన భర్తను కాకుండా కొడుకు లేదా కుమార్తెను పెన్షన్ నామినీగా ఎంచుకోవచ్చు. మహిళలకు సంబంధించి ఇది అత్యంత కీలమైన పరిణామంగా భావిస్తున్నారు.
పెన్షన్‌కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తోంది. ఈసారి మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే కీలకమైన ప్రకటన జారీ చేసింది. మహిళా ఉద్యోగులు తమ మరణానంతరం ఫ్యామిలీ పెన్షన్‌కు భర్త కాకుండా కొడుకు లేదా కుమార్తెను ఎంచుకునే అవకాశం కల్పించింది. దీని ప్రకారం నిబంధనల్లో మార్పులు చేసింది. సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2021లో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు తమ పెన్షన్‌ను ఇకపై తమ పిల్లలకు ఇచ్చుకోవచ్చు.
కొడుకు లేదా కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్..
ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం సామాజికంగా పెనుమార్పులకు కారణమౌతుంది. సామాజిక, ఆర్ధిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఇప్పటివరకైతే మహిళా ఉద్యోగులు పెన్షన్ నామినీగా భర్తనే ఎంచుకునే వీలుంది. కానీ ఇకపై కుమారుడు లేదా కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్‌కు నామినీగా ఎంచుకోవచ్చు.
మహిళలకు సమాన హక్కులు కల్పించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగి తన కొడుకు లేదా కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్‌కు నామినీగా ఎంచుకోవచ్చు. మహిళా ఉద్యోగి మరణానంతరం ఆమె కోరుకున్నట్టుగా కొడుకు లేదా కుమార్తెకు ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది. పాత నిబంధనల ప్రకారం కేవలం భర్తనే నామినీగా ఎంచుకోవాలి.
పెన్షన్ నిబంధనల్లో చేసిన మార్పులతో మహిళా ఉద్యోగులకు అధికారం ఇచ్చినట్టైందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మార్పు ద్వారా పెళ్లి బంధం తెగిపోయినా, విడాకుల ప్రక్రియ నడుస్తున్నా లేదా డౌరీ ఇతర కేసులు ఉన్నప్పుడైనా మహిళకు అదనపు హక్కులు కలుగుతాయి. ఇందులో భాగంగా మహిళా ఉద్యోగి లేదా పెన్షనర్ రాతపూర్వకంగా దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. భర్త స్థానంలో కుమారుడు లేదా కుమార్తెకు పెన్షన్ ఇవ్వాలని ఆమె దరఖాస్తు ఇవ్వాలి. మహిళా ఉద్యోగికి పిల్లల్లేకపోతే భర్తకే పెన్షన్ చెందుతుంది.
Also read: Cash Transaction Rules: భార్యాభర్తలు, తండ్రీకొడుకుల మధ్య లావాదేవీలపై ట్యాక్స్ పడుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook