Imran Khan Cipher Case: ఇమ్రాన్‌ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష.. సైఫర్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు 

Imran Khan Jail: అధికార రహాస్య పత్రాల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన సన్నిహితుడు షా మహ్మద్‌ ఖురేషికీ కూడా శిక్ష పడిందని పాక్‌ మీడియా వెల్లడించింది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌కు ఈ తీర్పు మరింత చిక్కుల్లోకి నెట్టింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 30, 2024, 08:59 PM IST
Imran Khan Cipher Case: ఇమ్రాన్‌ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష.. సైఫర్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు 

Cipher Case: పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక రహస్యాలను వెల్లడించిన కేసులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఇస్లామాబాద్‌ హైకోర్టు పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదేనంటూ ఆయన గతంలో ఓ సభలో కొన్ని పత్రాలను బహిరంగంగా ప్రదర్శించారు. అమెరికాలోని పాకిస్థాన్ ఎంబసీ నుంచి వీటిని సేకరించినట్లు తెలిపారు. ఆయన మీద గతంలో కేసు నమోదైంది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని జైలులో ఉన్నాడు.

తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు ట్రయల్‌ కోర్టు వేసిన శిక్షను ఇటీవల ఇస్లామాబాద్‌ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది స్టే ఇచ్చిన క్షణాన సైఫర్‌ కేసులో ఇమ్రాన్‌ అరెస్టవడం గమనార్హం. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసు విషయమై పాక్‌ ఫెడరల్‌ ఇన్వేస్టిగేషన్‌ ఏజెన్సీ గతేడాది సెప్టెంబర్‌లో వారిద్దరిపై చార్జ్‌షీట్‌ సమర్పించింది. భద్రతా సమస్యల దృష్ట్యా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్‌ హస్నత్‌ జుల్కయిరైన్‌ విచారణ చేపట్టారు. జైలులోని విచారణ చేపట్టిన కేసులో పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో పాకిస్థాన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఈ-ఇన్సాఫ్‌ మద్దతుదారులు బలూచిస్తాన్‌లో దాడులకు దిగారు. బాంబు పేలుళ్లకు పాల్పడడంతో ముగ్గురు మృతి చెందారు. 

సైఫర్‌ కేసు
ఈ కేసు దౌత్యపరమైన సమాచారానికి సంబంధించినది. గతేడాది మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహాస్య దౌత్య కేబుల్‌ (సైఫర్‌)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. అధికారిక రహాస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇమ్రాన్‌పై కేసు నమోదైంది. ఏప్రిల్‌ 20022లో అవిశ్వాస తీర్మానంలో ఓడి పాకిస్తాన్‌ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ దిగిపోయారు. తోషాఖాన్‌ కేసులో ఇస్లామాబాద్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 5 ఆగస్టు 2023న ఇమ్రాన్‌ జైలు పాలయ్యారు.

Also Read: Kishan Reddy Letter: కేసీఆర్‌ పట్టించుకోలే మీరైనా సహకరించండి.. సీఎం రేవంత్‌కు కిషన్‌ రెడ్డి లేఖ

Also Read: Assistant Loco Pilot Jobs: పదో తరగతి పాసైతే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయొచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News