Astrology: ఫిబ్రవరి 05 నుంచి వీరు ఏది ముట్టుకున్నా బంగారమే.. మీ రాశి ఉందా?

Mars Transit 2024: ఫిబ్రవరి 05న కుజుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. ఇతడు సూర్యుడి కలిసి అరుదైన రాజయోగాన్ని చేయబోతున్నాడు. దీంతో కొందరి తలరాత మారబోతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 05:21 PM IST
Astrology: ఫిబ్రవరి 05 నుంచి వీరు ఏది ముట్టుకున్నా బంగారమే.. మీ రాశి ఉందా?

Sun and Mars Conjunction 2024 in Capricorn: ఆస్ట్రాలజీలో ధైర్యసాహసాలకు కారకుడిగా అంగారకుడిని భావిస్తారు. కుజుడు మరో నాలుగు రోజుల్లో రాశిని మార్చబోతున్నాడు. ఫిబ్రవరి 05న మార్స్ మకరరాశి ప్రవేశం చేయనుంది. ఇప్పటికే అదే రాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు. మకరరాశిలో సూర్యుడు మరియు కుజుడు కలయిక వల్ల ఆదిత్య మంగళయోగం సంభవించబోతుంది. ఇది ఐదు రాశులవారికి లాభదాయకంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేషం: ఆదిత్య మంగళ యోగం వల్ల మేషరాశి వారు కెరీర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. 
వృశ్చికం : ఉద్యోగం కోసం ఎదురు చూసే వారి కోరిక ఫలిస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. 
మీనం: మీరు సుఖశాంతులతో కూడిన జీవితాన్ని గడుపుతారు. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. అగిపోయిన పనులు వెనువెంటనే పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండబోతోంది. 

Also Read: Mercury Set 2024 effect: ఈ నెల రోజులు ఈ 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి... లేకపోతే అంతే!

వృషభం: మీ డబ్బు విపరీతంగా పెరుగుతుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 
తుల: కుజుడు మరియు సూర్యుడు సంయోగం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మీ బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది. మీ కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.
(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Trigrahi Yog 2024: 50 ఏళ్ల తర్వాత కుంభరాశిలో త్రిగ్రాహ యోగం.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News