Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనికి ముందుగానే టిక్కెట్స్ బుకింగ్ లేదా టైమ్ స్లాట్ బుకింగ్ చేసుకుంటారు. అయితే, మీరు కూడా ఈనెలలో తిరుమల వెళ్లాలనుకుంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే తిరుమల దర్శనానికి సంబంధించి టీటీడీ యంత్రాంగం కీలక ప్రకటన చేసింది. దీన్ని గమనించి తిరుమల దర్శనానికి వెళ్లడం మంచిది. లేదంటే భక్తులు ఇబ్బందులు పడాల్సిన వస్తుంది.
ఫిబ్రవరి నెల అంటే ఈ నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కీలక అప్టేడ్ ఇచ్చింది టీటీడీ. ఈ నెల రథసప్తమి సందర్భంగా టైం స్లాట్ టోకెన్లు రద్దు చేయనున్నట్లు తెలిపింది. రథసప్తమి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరుని ఏడు వాహనాలపై ఊరేగిస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
మొదటిరోజు అంటే ఫిబ్రవరి 16 న సూర్యప్రభ వాహనంలో శ్రీవారిని ఊరేగిస్తారు.
రెండోరోజు చిన్నశేషవాహనం, మూడో రోజు గరుడ వాహనం, నాల్గవ రోజు హనుమంత వాహనం, ఇక ఐదవరోజు చక్రస్నానం వంటి సేవలు నిర్వహిస్తారు. ఆరవ రోజు కల్పవృక్ష వాహన సేవ, చివరగా ఏడవరోజు సర్వభూపాల వాహన సేవలతో మలయప్ప స్వామిని శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిస్తారు. ఇది ఓ మినీ బ్రహ్మోత్సవాలను తలపిస్తాయి.
మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అంటారు. ఈరోజు ఆదిత్యుడు జన్మదినంగా పరిగణిస్తారు. ఈ నేథ్యంలో రథ సప్తమి వేడుకలను టీటీడీ ఘనంగా ప్రతియేటా నిర్వహిస్తోంది.
అందుకే రథ సప్తమి కారణంగా ఈనెల 15, 16, 17 రోజుల్లో టైం స్లాట్ టోకెన్ బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు టీటీడీ యంత్రాంగం ప్రకటించింది. అంతేకాదు ప్రత్యేక దర్శనం వృద్ధులు, ఏడాదిలోపు పిల్లలు, వికాలంగులకు కూడా ప్రత్యేక దర్శనం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)
ఇదీ చదవండి: Hindu Temple: ఈ 6 దేవాలయాల్లో హిందుయేతరులు నిషేధం.. కేవలం హిందూవులకు మాత్రమే ఎంట్రీ..
ఇదీ చదవండి: Name Astrology: ఈ 3 అక్షరాల పేర్లు ఉన్నవారి జీవితంలో డబ్బుకు కొరతే ఉండదట..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook