Zero Income Tax Countries: మనకు తెలిసి భారతదేశంలోని ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లించాలి. అది ప్రత్యక్షమో, పరోక్షమో ఏదో విధంగా పన్ను భారం పడుతుంది. ప్రజల నుండి వసూలు చేసే ఆదాయపు పన్ను ఏ దేశ ప్రభుత్వానికి అయినా ముఖ్యమైన ఆదాయ వనరు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ప్రభుత్వం పన్ను వసూలు చేయదు. ప్రజల ఆదాయం మొత్తం వారికే దక్కుతుందని అర్థం. ఆ దేశాలు ఏమిటో తెలుసుకుందాం
1. పన్ను రహిత దేశం విషయానికి వస్తే మొదటగా బహామాస్. ఈ దేశం పర్యాటకులకు స్వర్గధామం ,పశ్చిమ కనుమలలో ఉంది. ఈ దేశ ప్రజలు తమ ఆదాయంపై ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎంతైనా డబ్బు సంపాదించుకోవచ్చు.
2. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇక్కడ ముడి చమురు వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ఈ దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ దీనిపై ఆధారపడుతుంది. కాబట్టి అక్కడి ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. గల్ఫ్ దేశం బహ్రెయిన్ ప్రభుత్వం తన పౌరుల నుండి ఎలాంటి పన్నును వసూలు చేయదు.
3. కువైట్ కూడా చమురు ,గ్యాస్ సహజ నిల్వలను కలిగి ఉంది. ఈ దేశం రెండింటి నుండి బాగా సంపాదిస్తుంది దాని నుండి దాని ప్రజలు ప్రయోజనం పొందుతారు. అందుకే ఈ దేశంలోని ప్రజలు ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
4. మాల్దీవుల ప్రజలు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు అక్కడ సందర్శిస్తారు. ఇటీవల, ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించారు.
5. బ్రూనైలో చమురు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ నివసించే ప్రజలు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉత్తర అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలో ఉన్న కేమాన్ దీవులలో నివసిస్తున్న ప్రజలు కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook