Rajinikanth - Lal Salaam: రజినీకాంత్ లాస్ట్ ఇయర్ 'జైలర్' మూవీతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. తన వయసుకు తగ్గ రోల్లో నటించి మెప్పించారు తలైవా. ఈ మూవీ తర్వాత రజినీకాంత్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మరో సినిమా 'లాల్ సలాం'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌తో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో రజినీకాంత్‌కు చాలా యేళ్ల తర్వాత డైలాగ్ కింగ్ సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
చాలా కాలం తర్వాత అంటే దాదాపు పెదరాయుడు తర్వాత రజినీకాంత్ సినిమాకు సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ సినిమా అంటే మనో డబ్బింగ్ చెప్పాల్సిందే. ముత్తు నుంచి దాదాపు తలైవా ప్రతి సినిమాకు మనోనే డబ్బింగ్ చెబుతూ వచ్చారు. మధ్యలో కథానాయకుడు సినిమాకు మాత్రం దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇపుడు లాల్ సలాం సినిమా ట్రైలర్లో సాయి కుమార్ డబ్బింగ్ వాయిస్ రజినీకాంత్ సూట్ అయినట్టు అనిపించకపోయినా.. సినిమాలో మాత్రం అదిరిపోవడం ఖాయం అంటున్నారు.
ఒకపుడు రజినీకాంత్ నటించిన పెదరాయుడు సినిమాలో పాపా రాయుడు పాత్రతో 'ఆపరా.. ఆపరా' అంటూ రజినీకాంత్ చెప్పిన డైలాగులకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అంతకు ముందు బాషాలో రజినీకాంత్ . బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టు అనే డైలాగ్ గుర్తుంది కదా. తలైవా డైలాగులకు థియేటర్స్‌లో ప్రేక్షకులు ఉర్రూతలూగడానికి వెనక ఉన్న వాయిస్ సాయి కుమార్ దే కావడం విశేషం. తెలుగులో ఈ సినిమాల సక్సెస్‌లలో రజినీకాంత్ మెయిన్ పిల్లర్ అయితే.. దానికి సాయి కుమార్ వాయిస్ అదనపు ఆకర్షణగా మారి ఆయా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.
మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న రజినీకాంత్ లాల్ సలాం మూవీలో సాయి కుమార్ వాయిస్ ఏ మేరకు ప్రేక్షకులను మళ్లీ మంత్ర ముగ్దులను చేస్తుందా అనేది చూడాలి. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు ఇతర కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ నటించారు. ఇక క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ఈ సినిమాలో మరో కీ రోల్లో కనిపించనున్నారు. రీసెంట్గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అంతేకాదు యూ/ఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేసారు.
ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ఓ ఊరిలో ఓ సమస్య పరిష్కారం కోసం రెండు వర్గాలు పోట్లాడుకుంటాయి. ఈ సమస్యను క్రికెట్ ఆటతో రజినీకాంత్ ఎలా ఎండ్ కార్డ్ వేసాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రజినీకాంత్ ఇరు వర్గాలను సముదాయించే డాన్ మొయినీద్దిన్ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకు ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. పెదరాయుడు మినహాయిస్తే.. తలైవా అతిథి పాత్రలో నటించిన చిత్రాలేవి పెద్దగా ఆడలేదు. తమిళంలో నటించిన విజయ చిత్రంతో పాటు జగపతి బాబు హీరోగా నటించిన కథానాయకుడు, హిందీలో నటించిన బులంది, ఆతంక్ హీ ఆతంక్, ఫరిష్తే వంటి చిత్రాలేవి పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈయన అతిథి పాత్రలో నటించిన 'లాల్ సలాం' మూవీ ఏ మేరకు అలరిస్తుందనేనది చూడాలి.
రజినీకాంత్ 'లాల్ సలాం' కాకుండా టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో 'వెట్టాయన్' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్ కరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఓ రకంగా రజినీకాంత్ హీరోగా చివరి చిత్రం అని చెబుతున్నారు. ఏది ఏమైనా 70 యేళ్లకు పైగా వయసులో కూడా రజినీకాంత్ యంగ్ హీరోలకు ధీటుగా వరస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉండటం విశేషం.
Also read: Ananya Panday: అందాల తూనీగలా అనన్య పాండే, లేటెస్ట్ పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook