Man Finds Worm Crawling In Dairy Milk Chocolate: ఈ మధ్యకాలంలో చాలా చోట్ల సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లలో కొన్ని చోట్ల నాణ్యతను పాటించట్లేదు. ఎక్స్ పైరీ అయిపోయిన వస్తువులను స్టోర్ లోనే పెట్టుకుంటున్నారు. దీంతో షాపులో వస్తువులకు పురుగులు కన్పిస్తుంటాయి. ఇప్పటికే పలుమార్లు, బిర్యానీలో జంతువులు అవశేషాలు బయటడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. అదే విధంగా మేక, కోడి మాంసాల విక్రయాల దగ్గర కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.
Found a worm crawling in Cadbury chocolate purchased at Ratnadeep Metro Ameerpet today..
Is there a quality check for these near to expiry products? Who is responsible for public health hazards? @DairyMilkIn @ltmhyd @Ratnadeepretail @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/7piYCPixOx
— Robin Zaccheus (@RobinZaccheus) February 9, 2024
ఫుడ్ డెలీవరీ లలో కూడా క్వాలిటీ లేని ఫుడ్, జంతువుడు అవశేషాలు వచ్చి, వివాదాస్పదమైన అనేక ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చేసుకుంటాయి. పురుగులు, అవశేషాలు బైటపడగానే అధికారులు ఏదో కొన్నిరోజులు హడావిడి చేస్తుంటారు. ఆ తర్వాత... దుకాణాదారులతో కలిసిపోయి చూసి చూడనట్లు వదిలేస్తుంటారని చాలా మంది చెబుతున్నారు. అయితే.. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాబిన్ జాచెయస్ అనే వ్యక్తి అమీర్ మేట్ లోని మెట్రో స్టేషన్ లో డైరీ మిల్క్ ను కొనుగోలు చేశాడు. అక్కడున్న రత్నదీప్ రిటైల్ స్టోర్ నుండి తాను ₹ 45 కు డైరీ మిల్క్ కొన్నాడు. ఆ తర్వాత .. చాక్లెట్ తిందామని కవర్ తెరిచేసరికి, బతికున్న పురుగు పాకడం గమనించారు. వెంటనే ఈ ఘటనను వీడియో తీశాడు. దీన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు స్టాల్ పై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా.. నగరమంతాట స్టోర్ లలో ఎక్స్పైరీ అయిపోయాక..కూడా ప్రాడక్ట్స్ అమ్ముతున్నట్లు అనేక మంది ఆరోపిస్తున్నారు. ఈ పోస్టుపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా స్పందించింది. "ఈ సమస్యపై సంబంధిత ఫుడ్ సేఫ్టీ టీమ్ @AFCGHMC అప్రమత్తమైందని రిప్లై ఇచ్చారు. దీనిపై వీలైనంత చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.
అదే విధంగా.. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ కూడా పోస్ట్‌కి ప్రతిస్పందించింది. కొనుగోలు గురించి మరిన్ని వివరాలను అందించమని Mr Zaccheusని కోరింది. ఈ క్రమంలో... క్యాట్ బరీ సిబ్బంది స్పందిస్తు... "హాయ్, మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్) అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తోంది. మీకు అసహ్యకరమైన అనుభవాన్ని కలిగి ఉన్నందుకు మేము చింతిస్తున్నాము.
Read More: Honey Rose: రెడ్ ట్రెండ్ ని ఫాలోఅయిన హనీ రోజ్.. కానీ కొంచెం డిఫరెంట్ గా!
మీ ఆందోళనను పరిష్కరించడానికి మమ్మల్ని ప్రారంభించడానికి, దయచేసి మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, కొనుగోలు వివరాలను మాకు అందించడానికి Suggestions@mdlzindia.com వద్ద మాకు వ్రాయండి. మీ ఫిర్యాదుపై చర్య తీసుకునేలా చేయడానికి మేము ఈ వివరాలన్నింటినీ అభ్యర్థిస్తాము. ధన్యవాదాలు, కన్స్యూమర్ సంభాషణ, మాండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్)" అని కంపెనీ ఎక్స్‌లో రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రంర వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook