MEA Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా మంది యువత చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పని చేయడానికకైతే చాలామంది ఉద్యోగం రావాలని ఇష్టపడతానారు. ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖలో ఉద్యోగం వచ్చే గొప్ప అవకాశం లభించనుంది. మంత్రిత్వ శాఖ DPA-IV విభాగంలో కన్సల్టెంట్ పోస్టుల కోసం ఖాళీని విడుదల చేసింది, దీని కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్లో అని వివరాలను తనిఖీ చేయాలి. మీరు అర్హులైతే ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 ఫిబ్రవరి 2024గా నిర్ణయించబడింది.
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..DA తోపాటు ఇది కూడా పెరగొచ్చట..
దరఖాస్తు విధానం..
ఈ రిక్రూట్‌మెంట్ కోసం అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, అవసరమైన పత్రాలతో పాటు ఇచ్చిన చిరునామాకు పంపాలి. అంతేకాదు అభ్యర్థులు aopfsec@mea.gov.in ఇమెయిల్ చిరునామాకు కూడా ఫారమ్‌ను పంపవచ్చు .
అర్హత..
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుండి ఆర్కియాలజీ లేదా కన్జర్వేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా లేదా మ్యూజియం సైన్స్ లేదా సివిల్/స్ట్రక్చరల్ ఇంజినీరింగ్/ఆర్కిటెక్చర్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తవ్వకం, పునరుద్ధరణ , సంరక్షణ, మ్యూజియాలజీకి సంబంధించిన పనులు, ఐకానోగ్రఫీ సర్వే వంటి వారసత్వ అభివృద్ధి ప్రాజెక్టులలో 10 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలని అభ్యర్థులను కోరారు. అంతేకాదు అభ్యర్థులు 10 సంవత్సరాల పని అనుభవంలో భాగంగా డిజైనింగ్/DTP/సోషల్ మీడియాలో పని అనుభవం కూడా కలిగి ఉండాలి.
వయోపరిమితి:
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిక్రూట్‌మెంట్ 2024 కింద కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 35 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 60 సంవత్సరాలుగా నిర్ణయించింది.
ఇదీ చదవండి: పది పాసైతే చాలు కేంద్రప్రభుత్వ ఉద్యోగం.. 5639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..
ఎంపిక, జీతం..
అభ్యర్థులు ఇంటర్వ్యూ ఆధారంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా కన్సల్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో వారి పనితీరు ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులకు TA/DA ఇవ్వబడదు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏటా రూ.8.40 లక్షలు వేతనంగా అందజేస్తారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి