RIL Market Capitalization: రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డ్.. రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ అధిగమించిన తొలి భారత కంపెనీ

RIL Market Capitalization News: రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం కొత్తరికార్డును సొంతం చేసుకుంది. ఈ కంపెనీ షేర్ ధరలు పైకి దూసుకెళ్లడంతో రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను తాకిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 13, 2024, 02:08 PM IST
RIL Market Capitalization: రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డ్.. రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ అధిగమించిన తొలి భారత కంపెనీ

RIL Market Capitalization News: రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం కొత్తరికార్డును సొంతం చేసుకుంది. ఈ కంపెనీ షేర్ ధరలు పైకి దూసుకెళ్లడంతో రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను తాకిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. దీంతో అంబానీ కుటుంబం మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కంపెనీ షేర్ విలువ రూ. 2,700 పైకి ఎగబాకి రికార్డును సొంతం చేసుకుంది.  500 కంపెనీల జాబితాలో మళ్లీ అగ్రస్థానంలో రిలయన్స్ కంపెనీ నిలిచింది.

 రిలయన్స్ షేర్ దాదాపు రెండు శాతంపైగా పుంజుకుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ. 20 లక్షల కోట్ల మార్కును దాటింది. దీంతో RIL షేర్లు రికార్డు స్థాయికి చేరిన మొదటి కంపెనీగా అవతరించింది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ దిగ్గజం రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను తాకిన మొదటి భారతీయ కంపెనీగా రికార్డును సొంతం చేసుకుంది.

ఇదీ చదవండి: ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్.. మీకు పొరపాటు ఈ మెసేజ్ వస్తే జాగ్రత్త..

రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.15.07 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానంలో HDFC బ్యాంక్ ₹10.56 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: మీ పిల్లల పేరుపై ఇప్పుడే పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయండి.. 18 ఏళ్లకు రూ.32 లక్షలు పక్కా..

ఇదిలా ఉండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలిసారిగా 2019 నవంబర్ 28న మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 10 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. డిసెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ రూ. 17,265 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News