Medaram Jaggery Speciality: సమ్మక్క సారక్కకు బెల్లం ఎందుకు సమర్పిస్తారంటే..?

Medaram Jaggery Speciality: ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. వనదేవతలు సమ్మక్క సారక్క జాతర రెండేళ్లకు ఒకసారి జరుపుకొంటారు. దేశనలుమూలల నుంచి ఈ జాతరకు వస్తారు. సమ్మక్క సారక్కలను వనదేవతలుగా పూజించబడతారు.

Written by - Renuka Godugu | Last Updated : Feb 21, 2024, 02:56 PM IST
Medaram Jaggery Speciality: సమ్మక్క సారక్కకు బెల్లం ఎందుకు సమర్పిస్తారంటే..?

Medaram Jaggery Speciality: ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. వనదేవతలు సమ్మక్క సారక్క జాతర రెండేళ్లకు ఒకసారి జరుపుకొంటారు. దేశనలుమూలల నుంచి ఈ జాతరకు వస్తారు. సమ్మక్క సారక్కలను వనదేవతలుగా పూజించబడతారు. అప్పట్లో పండించుకున్న పంటలకు శిస్తులు కట్టాల్సి వచ్చేది. వాటిపై తిరుగుబాటి చేసిన వీరవనితలు సమ్మక్క సారక్క. అందుకే అప్పటి నుంచి నేటి వరకు పొలంపై శిస్తు లేదు.సమ్మక్క సారక్కలు ఎక్కడైతే చివరిసారిగా పసుపు కుంకుమ వదిలివెళ్లారు. అక్కడ చెట్లు పెరగడంతో పూజలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి గద్దెలకు పూజలు చేస్తారు.

ఇదీ చదవండి: Medaram Jatara: సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్నారా? మీకు బిగ్ అలెర్ట్..

బెల్లం ఎందుకు నైవేద్యంగా పెడతారు?
బెల్లం బంగారు రూపంలో సమ్మక్క సారలమ్మలకు నైవేద్యంగా పెడతారు. ఆ ప్రాంతంలో చెరుకు ఎక్కువ పండుతుంది. రాబడి ఎక్కువగా ఉండకపోవడంతో అక్కడివారు అమ్మవార్లకు మొరపెట్టుకున్నారు. అప్పుడు వనదేవతలు కలలో కనబడి నీ అంత బరువున్న బెల్లాన్ని సమర్పించమని చెప్పింది. దీంతో అతను అలాగే చేశాడు. ఇది అందరికీ తెలియడంతో ప్రతిఒక్కరూ సమర్పిస్తున్నారు. అమ్మవార్లు సాక్షత్తూ వాళ్లింటికి వెళ్లి కోరికలు తీరుస్తారట. ఆ బంగారాన్ని వేడి చేయకుండా అలాగే తినాలని అంటారు.

ఇదీ చదవండి: మంత్రికి సోకిన డెంగీ వ్యాధి.. మేడారం జాతర ఎలా జరుగునోనని ఆందోళన..

మరో కథ ప్రకారం..ఒకప్పుడు ఆదివాసులు బెల్లం బంగారంలా చూసుకునేవారట. సమ్మక్క సారలమ్మలు వనదేవతలు. కేవలం గిరిజనులు మాత్రమే సమ్మక్క సారలమ్మలను పూజించేవారు. వీళ్లకు ఉప్పు, బెల్లం ఎంతో ఇష్టం. వాటిని పెద్దమొత్తంలో నిల్వ చేసుకునేవారు. ప్రత్యేకంగా సమ్మక్కకు నైవేద్యంగా సమర్పించడానికి ప్రధాన కారణం. ఆ వనంలో తిరిగిన అమ్మవార్లు తీపిపదార్థాలు, బెల్లం ఎక్కువగా తినేవారట ఇలా అప్పటి నుంచి నైవేద్యంగా పెట్టడం మొదలుపెట్టారట. కోర్కెలు తీర్చుకోవడానికి తమ బరువు మొత్తం బెల్లాన్ని బంగారంగా సమర్పించడం మొదలెట్టారట. అంతేకాదు సమ్మక్క భర్త పేరు పగిడిద్ద రాజు అంటే బంగారం బెల్లానికి బంగారం అనే పేరు వచ్చిందని మరికొందరు చెబుతారు. భక్తుల మొక్కల్లో ఎదురుకోళ్లు ఒకటి.కోళ్లను పైకి ఎగరేస్తారు. అమ్మవారికి మొక్కు చెల్లిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News