Pollen Allergy Symptoms and Treatment: సీజన్లను బట్టి వివిధ రకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి. కొందరు సీజన్లతో సంబంధం లేకుండా అలర్జీ బారినపడి ఇబ్బందులు పడుతుంటారు. వాతావరణంలో మార్పులకుతోడు దుమ్ము, ధూళి, కాలుష్యం కారణంగా అలర్జీలు ఎక్కువగా వస్తాయి. అలర్జీని చాలా మంది లైట్ తీసుకున్నా.. కొందరిని చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. రానున్న వసంత కాలంలో పూలు పూసే సమయంలో గాలిలో ఉండే పుప్పొడి ముక్కుల్లో చేరి అలర్జీని కలిగిస్తాయి. మన దేశంలో 20 నుంచి 30 శాతం మంది వరకు ఏదో ఒక అలర్జీతో బాధపడుతన్నారు. ఇందులో 15 శాతం మంది ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారు. పుప్పొడి ద్వారా వచ్చే అలర్జీని గవత జ్వరం అని కూడా పిలుస్తారు.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్రిబుల్ బొనంజా.. ఒకేసారి మూడు కీలక ప్రకటనలు..!
నిరంతరం తుమ్ములు, ముక్కు కారటం, కళ్లు ఎరుపురంగులోకి మారటం, చెవులు, గొంతు అంగిలిలో దురద వంటి లక్షణాలు ఉంటే.. పుప్పొడి అలర్జీ బారినపట్లేనని డైనస్ లీడ్ రీసెర్చ్ సైంటిస్ట్ జోవాస్ కాంగ్ చెప్పారు. పుప్పొడి అలర్జీ కేవలం వసంత కాలంలోనే మాత్రమే కాకుండా మీరు నివసిస్తున్న ప్రాంతం, వాతావరణం బట్టి వస్తుందన్నారు. కొన్ని మొక్కలు కాలాలను బట్టి వృద్ధి చెందుతాయని కాబట్టి.. పుప్పొడి అలర్జీ ఏడాది పొడవునా ఉంటుందన్నారు. అలర్జీ లక్షణాలను అంచనా వేసి.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే సకాలంలో అరికట్టవచ్చని చెప్పారు.
సాధారణంగా వసంత కాలంలో కనిపించే చెట్ల పుప్పొడి నుంచి కొంతమందికి అలర్జీ సోకుతుంది. మరికొంత మందికి గడ్డి పుప్పొడితో సమస్య ఉంటుంది. గడ్డి పుప్పొడిలు ఎక్కువగా సెప్టెంబర్ నెలలో వస్తాయి. పుప్పొడి రేణువులు బట్టలు, పెంపుడు జంతువులకు అంటుకుని రావొచ్చు.
ఇంట్లో శుభ్రంగా ఉంచుకోండి..
పుప్పొడి రేణువులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవి చాలా తేలికగా ఉండడంతో దుమ్ము ధూళి కణాల్లో కలిసిపోయి ఉంటాయి. కిటీకి అంచులు, కర్టెన్లు, సాఫ్ట్ ఫర్నిషింగ్‌లు, ఫాబ్రిక్ కవర్లు, దిండ్లు, పరుపులు, సోఫాలు వంటి వాటి వద్ద నెల రోజులకు పుప్పొడి రేణువులు ఉంటాయి. పుప్పొడి అలర్జీ కారకాలను తొలగించేందుకు మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
మందులు వాడినా పుప్పొడి అలర్జీ లక్షణాలు తగ్గకపోతే.. అలర్జీ షాట్లను వైద్యులు సిఫార్సు చేస్తారు. ఇమ్యునోథెరపీలో భాగంగా ఈ షాట్లను అందజేస్తారు. సంవత్సరంలో కొన్ని సమయాల్లో యాంటీ అలర్జీ మెడిసిన్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అలర్జీతో బాధపడేవారు మురికి ప్రాంతాలకు వెళ్లకూడదని.. వెళ్లినా మాస్క్ ధరించి వెళ్లాలని సూచిస్తున్నారు.
Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్, ధర పరంగా ఇదే బెస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter