Big Relief To Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు షో విజేతగా నిలిచిన అనంతరం పల్లవి ప్రశాంత్ అభిమానులు సృష్టించిన హంగామా, ఘర్షణతో తీవ్ర వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సుల ధ్వంసం.. ప్రైవేటు వాహనాలు కూడా ధ్వంసం కావడంతో కేసు నమోదైంది. ఈ కేసులో జైలు శిక్ష ఎదుర్కొని బెయిల్‌పై ఉన్న పల్లవి ప్రశాంత్‌కు కోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో తాజాగా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పల్లవి ప్రశాంత్ అభిమానులు ఆనందంలో మునిగారు.
Also Read: Nitesh Tiwari Ramayan: రామాయణంలో 'జాతిరత్నం'.. కామెడీ హీరో నుంచి లక్ష్మణుడిగా బంపరాఫర్
సిద్దిపేట జిల్లాకు చెందిన పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్-7 విజేతగా నిలిచాడు. అనంతరం అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణపై నమోదైన కేసులో ప్రశాంత్‌కు కోర్టు ఊరటనిచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. పల్లవి ప్రశాంత్‌తోపాటు అతడి సోదరుడు ఇకపై జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరు కానవసరం లేదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు మనోహర్ కొంత విముక్తి పొందారు.
Also Read: Keeda Cola: కీడా కోలాకు 'ఏఐ' దెబ్బ.. ఎస్పీబీ వాయిస్ వాడుకున్నందుకు రూ.కోటి చెల్లించాల్సిందే
ఈ కేసులో ప్రశాంత్‌తోపాటు అతడి సోదరుడు మనోహర్‌కు రెండు నెలల జైలు శిక్ష పడింది.రెండు రోజుల అనంతరం కోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేయడంతో వారిద్దరూ బయటకు వచ్చారు. అయితే జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా రెండు నెలల శిక్ష కాలం పూర్తవడంతో ఇకపై జూబ్లీహిల్స్ పోలీసుల స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. కండీషన్ రిలాక్సేషన్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.
రైతుబిడ్డగా గుర్తింపు పొందిన ప్రశాంత్ బిగ్‌బాస్ విజేతగా నిలిచి సంచలనం రేపాడు. అనంతరం జరిగిన ఘర్షణల వలన ప్రశాంత్‌తోపాటు అతడి సోదరుడు మనోహర్ ఏ1, ఏ2గా కేసులు నమోదయ్యాయి. తాజా కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ సందర్భంగా 'ఎప్పటికైనా న్యాయమే గెలుస్తది' అని రాసుకున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రశాంత్‌కు కొన్ని సూచనలు చేస్తున్నారు. 'ఇకపై హడావుడి చేయకుండా నీ పని నువ్వు చూసుకో' అంటూ హితవు పలుకుతున్నారు. 'ర్యాలీలు చేయొద్దు' అని సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి