500 LPG Scheme: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది. తమను గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు. అదేవిధంగా ఒక్కో గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచింది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇటీవలె అభయహస్తంలో భాగంగా దరఖాస్తు పారమ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇది ప్రాసెసింగ్ దశలో ఉంది.మేడారం సమీపంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి ప్రియాంకా గాంధీ హాజరవుతారని వెల్లడించారు.
ఇదీ చదవండి: No Electricity Bill: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. మార్చి నెల కరెంట్ బిల్లు కట్టనవసరం లేదు
మేడారంలో సమ్మక్క, సారక్క కొలువుదీరడంతో శుక్రవారం తల్లులను రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. అనంతరం మేడారం సమీపంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి ప్రియాంకా గాంధీ హాజరవుతారని వెల్లడించారు.
అయితే, నేడు ఫిబ్రవరి 27న రెండు గ్యారంటీలను ప్రారంభించనున్నారు. రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాలను సచివాలంయలో ప్రారంభించనున్నారు. అంతేకాదు నేడు చేవెళ్లలో బహిరంగ సభకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజరుకానున్నారు.
ఇదీ చదవండి: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో మొదట సొంత జాగా ఉన్న పేదాలకు రూ.5 లక్షలు కేటాయించనుంది. ఇదిలా ఉంటే టూ వీలర్ ఉన్నా... చిన్నకారు ఉన్నా.. ఇందిరమ్మ పథకానికి అనర్హులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇళ్లలో ఉపయోగిస్తున్న కరెంటును కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట. అయితే, దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook