Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ధోనీ దంపతులు, పిక్స్ వైరల్

Anant Ambani: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ గుజరాత్ లో జామ్ నగర్ లో చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2024, 11:30 AM IST
Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా  ధోనీ దంపతులు, పిక్స్ వైరల్

Anant Ambani Pre Wedding: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ గుజరాత్ లో జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారధులు తరలివస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవి మార్చి 03 వరకు జరగనున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్, బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణే, పాప్ సింగర్ రిహన్నా, క్రీడాకారులు సచిన్ టెండ్యూల్కర్, డ్వేన్ బ్రేవో, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ తదితరులు తరలివచ్చారు.

అయితే ఫ్రీవెడ్డింగ్ వేడుకల్లో ఎంఎస్ ధోనీ, ఆయన సతీమణి సాక్షీ ధోనీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తాజాగా బ్లాక్ డ్రెస్సు(Black Attire)లో మెరిసింది. ఆస్కార్స్ రెడ్ కార్పెట్ పై పాప్ స్టార్స్ రీతిలో ఆ జంట దర్శనమిచ్చింది. స్లీక్ ష‌ర్ట్, బ్లేజ‌ర్ వేసుకున్న  ధోని చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. మరోవైపు ఆయన భార్య సాక్షి కూడా బ్లాక్ డ్రైస్ లో చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలకు దాదాపు రూ.1000 కోట్లు దాకా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు ఒక్కో రోజు ఒక్కో థీమ్‌తో జరుగుతున్నాయి. త్వరలోనే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి జరగనుంది.ఈ వేడుకలకు తెలుగు నుంచి రామ్ చరణ్ మాత్రమే అహ్వానం అందినట్లు తెలుస్తోంది. చెర్రీ ఉపాసన దంపతులు ఈరోజు ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. 

Also Read: PKL 2024: పీకేఎల్‌ పదో సీజన్‌ విజేతగా పల్టాన్‌.. ఫైనల్లో హరియాణాపై గెలుపు..

Also Read: Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో జైస్వాల్.. ధర్మశాల టెస్టులో నెరవేరుతుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News