Bengaluru Bomb Blast Case: రవ్వ ఇడ్డీ ఆర్డర్ చేసి బాంబు సెట్ చేసేశాడు, బెంగళూరు బాంబు పేలుడు ఘటనలో నిందితుడి గుర్తింపు

Bengaluru Bomb Blast Case: బెంగళూరు రామేశ్వరం కెఫేలో జరిగిన బాంబు బ్లాస్ట్ ఘటనలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. సీసీటీవీ పుటేజ్ కీలకంగా మారిన నేపధ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నిందితుడిని గుర్తించే ప్రక్రియ నడుస్తోంది. నిందితుడిని గుర్తించామని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2024, 09:17 AM IST
Bengaluru Bomb Blast Case: రవ్వ ఇడ్డీ ఆర్డర్ చేసి బాంబు సెట్ చేసేశాడు, బెంగళూరు బాంబు పేలుడు ఘటనలో నిందితుడి గుర్తింపు

Bengaluru Bomb Blast Case: దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనలో నిందితుడిని గుర్తించామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సీసీటీవీలో రికార్డ్ అయిన మాస్క్ మనిషిని గుర్తించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వినియోగించి ఎవరో గుర్తించినట్టు తెలుస్తోంది. 

బెంగళూరు రామేశ్వరం కెఫే ఘటనలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించింది. ఓ వైపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఘటనా స్థలాన్ని పరిశీలించాయి. మొత్తం వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారినా..నిందితుడు మాస్క్, క్యాప్ ధరించి ఉండటంతో ఎవరో గుర్తించడం కష్టమైంది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగించి నిందితుడెవరో గుర్తించినట్ట తెలుస్తోంది. ఇక ఆ నిందితుడు ఎక్కడున్నాడో వెతికేందుకు దాదాపు 10 బృందాలు రంగంలో దిగాయి. నిందితుడెవరో తేలినందున త్వరలోనే పట్టుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. 

అసలేం జరిగింది

మార్చ్ 1వ తేదీ శుక్రవారం ఉదయం బ్రూక్ ఫీల్డ్ ఐటీపీఎల్ రోడ్‌లోని రామేశ్వరం కెఫేలోకి తలపై క్యాప్, మాస్క్ ధరించిన ఓ వ్యక్తి ప్రవేశించాడు. దాదాపు 25-30 ఏళ్ల వయస్సుండవచ్చు. ఉదయం 11.30 గంటలకు బస్సు దిగి నేరుగా కెఫేకు వచ్చాడు. రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. ఓ 15-20 నిమిషాలుండి వెల్లిపోయాడు. ఈలోగా బాంబుకు టైమర్ సెట్ చేసి ఆ బ్యాగ్‌ను కెఫేలోని సింక్ వద్ద ఉన్న డస్ట్ బిన్ పక్కనపెట్టి ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయాడు. సరిగ్గా గంట తరువాత ఆ బ్యాగ్‌లోని బాంబు పేలింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు కానీ పది మంది గాయపడ్డారు. 

ప్లేట్ రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసి బాంబు టైమర్ సెట్ చేసి వెళ్లిపోవడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఈ పేలుడులో సదరు నిందితుడు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ వాడినట్టు గుర్తించారు. ఇడ్లీ ఆర్డర్ చేసినంత తేలిగ్గా బాంబు సెట్ చేసి వెళ్లిపోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అయితే ఇప్పుడు ఏఐ ఆధారంగా నిందితుడి ఫోటోలు వచ్చేశాయని త్వరలోనే పట్టుకుంటామని ప్రభుత్వం చెప్పడం విశేషం.

Also read: Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ లో పేలుడు.. సీసీటీవీలో రికార్డైన నిందితుడి కదలికలు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News