Viral Video: ఇది మామూలు వింత కాదు రా బాబు.. సెలూన్‌లో గడ్డం గీయించుకున్న యువతీ!

Woman Shaving Her Beard Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువతి జెంట్స్ సెలూన్ కి వెళ్లి గడ్డం గీయించుకున్న సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఇదేం వింత రా బాబు అని కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 3, 2024, 05:13 PM IST
Viral Video: ఇది మామూలు వింత కాదు రా బాబు.. సెలూన్‌లో గడ్డం గీయించుకున్న యువతీ!

 

Woman Shaving Her Beard Viral Video: బ్రహ్మంగారు కాలజ్ఞాన రూపంలో భవిష్యత్తులో జరిగే వింతల గురించి కొన్ని వందల ఏళ్ళ క్రితమే చెప్పారు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వింతల గురించి రాస్తున్న క్రమంలో చెప్పిన ఆశ్చర్యకరమైన విషయాలు ఆ సమయాల్లో విన్నవారికి నమ్మశక్యంగా అనిపించలేదు. నిజానికి అలాంటి వింతలు ప్రస్తుతం ఒక్కటొక్కటిగా జరుగుతూ, వార్తల రూపంలో బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా జరుగుతున్న వింతలను కళ్ళతో చూసి కూడా చాలామంది అవి నిజం కాదని నమ్మలేకపోతున్నారు. గతంలో వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అనేక విషయాలు ఇప్పటివరకు సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి అంగటని ఇటీవలే ఒకటి వెలుగు చూసింది. ఓ యువతి ఎంతో రద్దీగా ఉన్న బార్బర్ షాప్ కి వెళ్లి గడ్డం గీయించుకుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆమెకు తెలియకుండానే రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టిట్లో దుమ్ము దుమ్ముగా వైరల్ అవుతోంది..

వీడియో వివరాల్లోకి వెళితే..

ఓ 18 ఏళ్ల వయసు గల యువతి నిత్యం ఎంతో రద్దీగా ఉండే బార్బర్ షాప్ కి వెళ్లి షేవింగ్ చేయించుకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందని దానిపైన క్లారిటీ రాలేదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  పురుషులు సెలూన్ కి వెళ్లి సేవింగ్ చేయించుకోవడం సాధారణమైనప్పటికీ, నడి వయసులో ఉన్న యువతి వెళ్లి గడ్డం గీయించుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా అక్కడ ఉన్న బార్బర్ ఆ మహిళకు షేవింగ్ క్రీమ్ రాసి గడ్డం లాగా కత్తితో షేవింగ్ చేయడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఇదేం వింత రా బాబు అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

కొంతమంది అయితే ఈ వీడియోను చూసి షాక్ తిన్నారు. ఈ 15 సెకండ్ల గల వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి ప్రకృతి ధర్మం అనే టైటిల్ పెట్టి పోస్ట్ చేయడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాకుండా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో గతంలో కూడా టిక్ టాక్ లో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియో వివరాల ప్రకారం.. ప్రతి 15 రోజులకు ఒకసారి షేవింగ్ చేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోయి.. చర్మం అందంగా తయారవుతుందట. అంతేకాకుండా మేకప్ వేసుకునేందుకు కూడా మరింత సులభతరం అవుతుందని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఏది ఏమైనా జెంట్స్ సెలూన్ కి వెళ్లి యువతి షేవింగ్ చేసుకోవడం ఒక వింతే అని చెప్పొచ్చు.

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News