Revanth Reddy: తెలంగాణలో అరుదైన కలయిక జరిగింది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరం రేవంత్ రెడ్డి తొలిసారి ఈనాడు మీడియా సంస్థ అధినేత రామోజీ రావును కలిశారు. ఇప్పటికే మీడియా సంస్థల అధినేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రామోజీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన అనంతరం నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు.
Also Read: MP Candidates: బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన.. ఇద్దరు సిట్టింగ్‌లకు, మరో ఇద్దరు మాజీలకు చాన్స్
హైదరాబాద్ శివారులో ఉన్న ఫిల్మ్ సిటీలో రేవంత్ రెడ్డి కొద్దిసేపు రామోజీ రావుతో రహాస్యంగా చర్చలు జరిపారని సమాచారం. అయితే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. గంటకు పైగా అక్కడ గడిపారని సమాచారం. రామోజీతో వివిధ అంశాలను చర్చించారని తెలిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న పనులు, పథకాల అమలు, పాలన విధానాలపైన చర్చించారని విశ్వసనీయ సమాచారం.
Also Read: KA Paul: బాబు మోహన్ సంచలనం.. మూడు పార్టీలు వదిలేసి ఆఖరికి కేఏ పాల్ పార్టీలో చేరిక
వాటితోపాటు తెలంగాణతోపాటు జాతీయ రాజకీయ అంశాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారని సీఎంఓ వర్గాల సమాచారం. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీలో సీఎం వెంట ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఈనాడు ఎండీ కిరణ్ తదితరులు ఉన్నారు.
మీడియా సంస్థలతో ప్రత్యేక అనుబంధం
అధికారంలో ఉన్నప్పుడు మీడియా సంస్థలతో ముఖ్యమంత్రి సత్సంబంధాలు కొనసాగించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా రామోజీ రావును కలిసిన విషయం తెలిసిందే. అయితే రామోజీ రావు స్వయంగా ప్రగతిభవన్ విచ్చేసి కేసీఆర్‌ను కలవడం విశేషంగా నిలిచింది. ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. సీఎం అయ్యాక తొలి ఇంటర్వ్యూను రాధాకృష్ణకే ఇచ్చారు. ఇప్పుడు ఈనాడు మీడియా అధినేతతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి