Weekly Lucky - Unlucky Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి రెండవ వారంలో సూర్యగ్రహం శని రాశి అయిన కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మొత్తం అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. అదేవిధంగా ఈ వారంలోనే కొన్ని గ్రహాలు ఒకే రాశులు సంయోగం చేయబోతున్నాయి. అలాగే నక్షత్ర సంచారాలు కూడా జరగబోతున్నాయి. అయితే జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం ఈ గ్రహాలు నక్షత్రాలు జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అదే ఇవే గ్రహాలు ప్రతికూల స్థానంలో ఉంటే అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారు లాభపడితే మరికొన్ని రాశుల వారు తీవ్రంగా నష్టపోతారు. అయితే ఈ వారం ఏయే రాశుల వారు నష్టపోతారో.. ఏయే రాశుల వారు లాభపడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మార్చి 10 నుండి 17 వరకు లాభాలు పొందే రాశులు:
మేష రాశి:
ఈ వారం మేష రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది. మీరు ఈ సమయంలో కొత్త అవకాశాలు పొందడమే కాకుండా.. ఎలాంటి ప్రయత్నాలు చేసినా విజయాలు సాధించగలుగుతారు . ఆర్థికంగా కూడా వీరికి కలిసి వస్తుంది.
మిథున రాశి:
ఈవారం మిధున రాశి వారికి కూడా ఆర్థిక విషయాలను చాలా లాభదాయకంగా ఉంటుంది. వీరు ఊహించని డబ్బు పొందడమే కాకుండా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల రెట్టింపు ఆదాయం పొందుతారు. అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి:
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా చాలా బాగుంటుంది. మీరు మీ పనిలో గుర్తింపు పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే జీతాలు కూడా పెరగవచ్చు. అంతేకాకుండా కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి సాధిస్తారు.
ఈ రాశుల వారు ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి:
మేషరాశి:
మేష రాశి వారు ఈ సమయంలో ఎంతో ఉత్సాహంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పుడు ఆలోచనలు సతమతం చేసే అవకాశాలున్నాయి. దీనికి కారణంగా అనేక సమస్యలు రావచ్చు. కాబట్టి ఏవైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ వారం ఆదాయం రెట్టింపు అవుతుంది కాబట్టి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే చర్యలు చేయడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మళ్లీ ఆర్థిక సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నట్లు వారు చెబుతున్నారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎంతో కష్టపడి పనిచేస్తారు కాబట్టి ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. అయితే ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో మంచిది. అంతే కాకుండా ఆహారాలు తీసుకునే క్రమంలో కూడా తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
తులా రాశి:
తులా రాశి వారికి ఈ సమయంలో జీవిత భాగస్వామి మధ్య అనేక సమస్యలు రావచ్చు. కాబట్టి తప్పకుండా మీ భాగస్వామితో ప్రేమతో ఉండేందుకు ప్రయత్నించండి. అంతేకాకుండా వారితో కలిసి విహారయాత్రలకు వెళ్లడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీరు కూడా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో మంచిది.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి ఈ వారం ఎంతో చాలా సాహసోపేతంగా ఉండవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు చేసేవారు కష్టపడి పని చేయడం మంచిది. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం కూడా ఎంతో మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో ప్రమాదకరమైన పనులను చేయడం కూడా మానుకోవాలని వారు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Weekly Lucky - Unlucky Zodiac Sign: ఈ వారం లక్కీ, అన్ లక్కీ రాశుల వారు వీరే..