Vastu Tips For Car Accidents Prevention In Telugu: ప్రస్తుతం చాలామంది కార్లను కొన్న తర్వాత దేవుడి గుడి దగ్గరికి వెళ్లి వాటిని పూజిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల కారులో ఉన్న లోపాలు వాటిపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కారులో ఏదైనా వాస్తు దోషం ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు సమస్యలు వస్తాయట దీని కారణంగానే రోడ్డు ప్రమాదాలు, కారు ఎప్పటికప్పుడు చెడిపోవడం వంటి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి వాస్తు శాస్త్రం ప్రకారం, మీ కారులో కొన్ని వస్తువులను ఉంచుకోవడం ఎంతో శుభప్రదమని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి కారులో ఉంచుకోవడం వల్ల కారులో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి. రోడ్డు ప్రమాదాల మరణాలను నివారిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కార్లో ఏయే వస్తువులను ఉంచుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దేవుడి విగ్రహాలు ముఖ్యం:
కారులో తప్పకుండా పెట్టుకోవాల్సిన విగ్రహాల్లో వినాయకుడి విగ్రహం ఆంజనేయస్వామి కుమారస్వామి వేంకటేశ్వర స్వామి విగ్రహాలు ముఖ్యమని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. కారులో ఒక చోటి నుంచి మరోచోటికి వెళ్లే క్రమంలో ఈ విగ్రహాలను నమస్కరించి కారును స్టార్ట్ చేయడం వాస్తు ప్రకారం ఎంతో మంచిదని వారంటున్నారు. కాబట్టి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా మీ కారులో పై విగ్రహాలను పెట్టుకోవడం ఎంతో శుభప్రదం.
వాటర్ బాటిల్:
ప్రయాణంలో అన్ని సమయాల్లో కారులో నీటిని ఉంచడం కూడా చాలా మంచిదని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. వాస్తు ప్రకారం నీటిని శుభసూచికగా భావిస్తారు కాబట్టి కారులో ప్రయాణాలు చేసే క్రమంలో నీళ్లు బాటిల్ ఉండడం వల్ల మనస్సు ఎప్పుడు బలంగా ఉంటుంది. అంతేకాకుండా కారులో ప్రతికూల శక్తి తొలగిపోయి అనుకూల శక్తి ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మినరల్ సాల్ట్:
ప్రయాణ సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండడానికి డ్రైవర్ సీటు కింద రాతి ఉప్పును ముంచడం ఎంతో మంచిది. రాతి ఉప్పు మీ ఇంట్లో అందుబాటులో లేకపోతే బేకింగ్ సోడాను కూడా వినియోగించవచ్చని వాస్తు శాస్త్రానికి చెబుతున్నారు ఇలా చేయడం వల్ల కారులో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
నల్ల తాబేలు:
వాస్తు శాస్త్రం ప్రకారం కారులో నల్ల తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవడం కూడా ఎంతో శుభప్రదమని నిపుణులు సూచిస్తున్నారు. కారులో ఈ విగ్రహాన్ని ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అంతేకాకుండా కారు ప్రమాదాల నుంచి కూడా ఇది రక్షిస్తుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.
సహజ రాళ్లు:
కార్ల డ్యాష్‌బోర్డ్‌పై సహజమైన రాళ్లను కూడా పెట్టుకోవడం శుభప్రదమని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ రాళ్లు కూడా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేందుకు కీలక పాత్ర పోషిస్తాయట. అంతేకాకుండా రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా రక్షించేందుకు కూడా సహాయపడతాయని వాస్తు శాస్త్రంలో తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి