Brahmamudi March 14 Episode: దుగ్గిరాల వారింట అత్తాకోడళ్ల రచ్చ రచ్చ.. అప్పుతో నా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరన్న కల్యాణ్..

Brahmamudi March 14 Episode: నేటి ఎపిసోడ్లో మా స్నేహాన్ని ఎవరో వచ్చి తప్పు పడితే మేం తెలుసుకోకూడదా? వారెవరో చెప్పేవరకు నేను కదలను, రేపటివరకు అయినా ఇక్కడే ఉంటా? అంటాడు. ఇంకెవరు మీ అమ్మగారు లేదంటే అనామిక అయి ఉంటుంది అంటుంది అప్పు. కనకం అప్పుడు జరిగిందంతా అప్పు కల్యాణ్‌లకు చెబుతుంది. వాళ్ల బాధలో కూడా న్యాయం ఉంది అంటుంది కనకం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 14, 2024, 10:14 AM IST
Brahmamudi March 14 Episode: దుగ్గిరాల వారింట అత్తాకోడళ్ల రచ్చ రచ్చ.. అప్పుతో నా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరన్న కల్యాణ్..

Brahmamudi March 14 Episode:నేటి ఎపిసోడ్లో మా స్నేహాన్ని ఎవరో వచ్చి తప్పు పడితే మేం తెలుసుకోకూడదా? వారెవరో చెప్పేవరకు నేను కదలను, రేపటివరకు అయినా ఇక్కడే ఉంటా? అంటాడు. ఇంకెవరు మీ అమ్మగారు లేదంటే అనామిక అయి ఉంటుంది అంటుంది అప్పు. కనకం అప్పుడు జరిగిందంతా అప్పు కల్యాణ్‌లకు చెబుతుంది. వాళ్ల బాధలో కూడా న్యాయం ఉంది అంటుంది కనకం. అప్పుడే అక్కడి నుంచి కల్యాణ్ వెళ్లిపోతాడు. దుగ్గిరాల వారి ఇంట ఇక రచ్చ లేపుతారు అనామిక ధాన్యలక్ష్మిలు. కావ్య.. కావ్య.. అంటూ అరిచి మరి హాల్లోకి పిలుస్తారు. నీ ఉద్దేశం ఏంటి? నా కొడుకును కోడలును సుఖంగా కాపురం చేసుకోనివ్వవా? అని ధాన్యలక్ష్మి నిలదీస్తుంది. ఏంటే ఆవిడ అంతగా మైక్ మింగినట్లు అరుస్తే నువ్వు బిత్తరపోయి చూస్తున్నవ్ అంటుంది స్వప్న కావ్యను. నేను నీ చెల్లిని అడుగుతున్నాను నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటుంది ధాన్యలక్షి.  ఆపండి.. అని అరుస్తుంది కావ్య ఆరోపించే ముందు ఆధారాలు ఉండాలి. అపనింద వేయడానికి కూడా అర్థం ఉండాలి. ఎవరి కాపురాన్ని ఎవరు కూలుస్తున్నారు అంటుంది కావ్య. ఒకప్పుడు ఇల్లు పచ్చగా ఉండేది ఒకరి సంతోషం ఇంకొకరు కోరుకునేవారు అలాంటి పచ్చని సంసారంలో రోజుకో గొడవ మొదలు పెడుతుంది మీరు ఇప్పుడు ఈరోజు భాగోతం మొదలెట్టరు.. సరే కానీ, నీ కొడుకు కోడల్ని నేనిప్పుడు విడగొట్టాలని అనుకున్నానో చెప్పండి అడుగుతుంది కావ్య. నా కొడుకుని ఆఫీసుకు రాకుండా కవిత్వం రాసుకుంటు బతకమని నేర్పింది నువ్వు. అప్పుడు నేను పట్టించుకోలేదు జరిగేవన్ని చేస్తున్నవి నువ్వు. నాకొడుకు ఆఫీసుకు వస్తే నీ ఆటలు సాగవని వాన్ని అడ్డు తొలగించుకున్నావ్ అంటుంది ధాన్యలక్షి.

అప్పుడే రాజ్ పిన్ని.. కళావతి చెబితే వినే వ్యక్తి కాదు కదా కల్యాణ్ అని నిలదీస్తాడు. రుద్రాణీ రాహుల్ లు ఈ దృశ్యాన్ని ఎంతో ఆనందంగా తిలకిస్తూ చూస్తారు. ఇక అపర్ణ కూడా రంగంలోకి దిగుతుంది. అత్తాకోడళ్లు కూడ గలుపుకొని ప్రతిరోజూ ఇదేం రచ్చ.. ఆఫీసుకు వెళ్లమని నువ్వు చెప్పు ఎవరు ఆపుతారో నేను చెబుతాను అంటుంది అపర్ణ. నాకోడలు ఏం తప్పు చేసింది చెప్పు, ఏం చేసింది చెప్పు అని గట్టిగా నిలదీస్తుంది అపర్ణ.ఏంటీ? అంటుంది కావ్య. అవును నా కొడుకును కోడల్ని విడదీసి వాళ్ల చెల్లిని కలపాలని చూస్తుంది. నా అత్తే తింగరమేళం అనుకుంటే నువ్వు ఇంక పెద్ద తింగరమేళంలా ఉన్నావు అంటుంది స్వప్న. ఈ డ్రామాలో నీ హస్తం కూడా ఉందా? అడుగుతుంది ధాన్యలక్ష్మి. నా హస్తం పెడితే అది భస్మాసురా హస్తం అవుతుంది అంటుంది స్వప్న. నాభర్తతో నన్ను కాపురం చేయనివ్వడం లేదు ఇద్దరు అక్క చెల్లెల్లు నన్ను మా ఆయన్ని విడగొడుతున్నారు అంటుంది అనామిక.

ఇదీ చదవండి: క్యూట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తోన్న మహా నటి కీర్తి సురేష్.. లేటేస్ట్ పిక్స్ వైరల్..

అనామిక అసలు వారెందుకు కలుసుకున్నారో తెలీదు అంటుంది కావ్య. అప్పుడే ఇందిరాదేవి కూడా కలుగుజేసుకుని ధాన్యలక్ష్మి అసలు ఏం జరిగింది? అంటుంది. కల్యాణ్ అనామిక మేడలో తాలికట్టిన వేళే కల్యాణ్ ను మర్చిపోమని చెప్పా.. అయినా నామాటను పెడచెవిన పెట్టింది. ఇక్కడ ఉన్న నాకెలా తెలుస్తుంది ఎవరు ఎవర్ని కలిశారో నాకేం తెలుసు. వాళ్లిద్దరూ కలిసినప్పుడు మీరు చూశారా? అంటుంది స్వప్న. హా.. చూశాం అంటుంది మరి అప్పుడే మీరు మీకొడుకును నిలదీయకుండా గాడిదపళ్లు తోముతున్నారా? మీ అత్తాకోడళ్లు అంటుంది స్వప్న.

ఇదీ చదవండి: జ్రీవాల్‌ను పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్‌ హీరోయిన్.. పిక్స్ వైరల్..

అప్పుడే కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. నీకేం తెలుసు? ఎంత వరకు కావ్య వదిన గురించి తెలుసు? అసలు మీ అత్తాకోడళ్లకు ఏం తెలుసు? అంటాడు కల్యాణ్. నన్ను అడగకుంటా ఎవరింటికి వెళ్లారు? ఎవరి కంట కన్నిళ్లు తెప్పిచ్చారు? మళ్లీ ఈ ఇంట పెంట చేస్తున్నారు అంటాడు. అప్పుడే రాజ్ ఏం జరిగింది కల్యాణ్ అంటాడు. వీల్లు నా వ్యక్తిత్వాన్ని తప్పుపడుతున్నారు వదిన వాళ్లింటికి వెళ్లి కూడా నానామాటలు అనేసి వచ్చారు అని చెబుతాడు. అసలేంటి? ఏమనుకుంటున్నారు? నాకు క్యారెక్టర్ లేదా? అప్పుకు క్యారెక్టర్ లేదా? వాళ్లింటికి ఎందుకు వెళ్లారు మీకెం హక్కు ఉంది మీ కొడుకును కాబట్టి నన్నడగాలి అంటాడు. నీ భార్యగా నాకు అన్ని హక్కులు లేవా? అంటుంది అనామిక. షటాప్.. దిగాజారిపోయి మాట్లాడితే నా తల్లినే నేను లెక్క చేయను నువ్వెంతా నీ బతుకెంతా అంటాడు కల్యాణ్. అప్పు గురించి ఏమో అన్నావట.. తలకాయుందా నీకు నేను గనుక అప్పును చేసుకోవాలనుకుంటే ఈ ఇంట్లో ఏ ఒక్కరు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడేవారే కాదు. అది తెలీదా? నీకు. కల్యాణ మంటపంలో అప్పు గుండెపగిలి వెల్లిపోతే కూడా నేను జాలిపడ్డాను ఈ జన్మకు నువ్వే నాభార్య అని మాయలో పడ్డా అంటాడు. కల్యాణ్ ఆ కుటుంబాన్ని వెనుకేసుకునిరాకు అంటుంది. ఎందుకు వదినేం తప్పు చేసింది అంటాడు? నా కళ ను గుర్తించి ఎదగమని చెప్పింది ఏ తల్లి చెబుతుంది ఈ తల్లి చెప్పింది. నువ్వు పేరుకే తల్లివి నావి పిచ్చిరాతలు అని కొట్టిపారేసావు. పెద్దమ్మ, నానమ్మ, అన్నయ్య వీళ్ల చేతిలో పెరిగా నేను. ఎంతసేపు పట్టుచీరలు, బంగారు నగలు మాత్రమే చూసుకుంటావు. ఇప్పుడు ఈ ఇంట్లో రచ్చ లేపుతున్నారు. ఈ ఇంటిని ముక్కలు చేద్దామని చూస్తున్నారు అంటాడు కల్యాణ్. ఇంటిని ముక్కలు చేయాలంటే నీ అమ్మ, అమ్మమ్మ తాతలు దిగిరావాలి అంటుంది ఇందిరాదేవి. నిలువెత్తు సంస్కారం ముందు నువ్వు అణువంత కనిపిస్తున్నావ్ వెళ్లు.. అని చిరగ్గా చెబుతాడు అనామికను కల్యాణ్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News