Game Changer: గేమ్ చేంజర్ కథ ఇదే.. ఏకంగా ముగ్గురు విలన్లు!

Game Changer Update: రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా గేమ్ చేంజర్. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే దాని పైన ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక అప్డేట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2024, 07:00 AM IST
Game Changer: గేమ్ చేంజర్ కథ ఇదే.. ఏకంగా ముగ్గురు విలన్లు!

Ram Charan

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ రేంజ్ గ్లోబల్ గా ఎంత పెరిగిందో అందరికీ తెలిసిన విషయమే. నేషనల్ వైడ్ కాదు ఇంటర్నేషనల్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఈ మెగా పవర్ స్టార్. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే వచ్చిన ఆచార్య డిజాస్టర్ గా మిగిలింది. కానీ అందులో రామ్ చరణ్ మెయిన్ హీరో కాకపోవడంతో రామ్ చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్ తరువాత వచ్చే సినిమా పై అభిమానులకు ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమా గేమ్ చేంజర్ అవ్వడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ చిత్రం దాదాపు మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడగా ఇంకా కూడా ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ సినిమా విశాఖపట్నంలో కీలక షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అని ముందే తెలిసినప్పటికీ కొన్ని కీలకమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ చిత్రంపై అఫీషియల్ అప్డేట్స్ రాకపోవడంతో ఈ లీక్ అయిన ఫోటోలు అలానే ఈ సినిమా గురించి ప్రస్తుతం వైరల్ అవుతున్న కథ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ చిత్రం గురించి వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం డైరెక్ట్ శంకర్ ఈ సినిమా కథా నేపధ్యాన్ని ముగ్గురు రాజకీయ విలన్లను ఆధారంగా చేసుకుని తీస్తున్నారు అనే విషయం. ఇందుకోసం ముగ్గురు సూపర్ యాక్టర్స్ ని కూడా శంకర్ ఆల్రెడీ తీసుకున్నారు. శ్రీకాంత్, ఎస్జె సూర్య, నవీన్ చంద్రలు ఆడే పొలిటికల్ గేమ్ ని రామ్ నందన్ ఐఏఎస్ ఎలా గెలిచాడనే పాయింట్ మీద ఈ సినిమా కథ మొత్తం నడుస్తుందట.

అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఒక సామాన్యుడైన గొప్ప మనిషి అప్పన్న ప్రజల కోసం పార్టీ పెడితే పక్కనే ఉన్న శ్రీకాంత్ వెన్నుపోటు పొడిచి ఆ పొలిటికల్ పార్టీ లేకుండా చేస్తాడు. ఇక శ్రీకాంత్ వారసుడు ఎస్జె సూర్య అంతకు మించిన స్వార్థంతో ఎత్తుగడలు వేస్తాడు. మరి ఎస్.జే సూర్యకి నవీన్ చంద్ర కొడుకా లేక తమ్ముడా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. జనం సొమ్మును.. ఆశలని పీల్చి పిప్పి చేసే ఈ రాక్షసులను ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చిన అప్పన్న కొడుకు రామ్ చరణ్ ఎలా కట్టడి చేస్తాడనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది. 

కార్తీక్ సుబ్బరాజు అందించిన కథలో చాలా ఎమోషన్స్ అలానే ఎలివేషన్స్ ఉంటాయని సమాచారం. మరోపక్క ఈమధ్య ఈ సినిమా నుంచి లీకైన ఒక ఫోటోలో హీరోయిన్ కియారా అద్వానీ చీరకట్టు అదీ చూస్తుంటే.. ఆమె పాత్ర కూడా ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉందే పాత్రే అని.. ఏదో కేవలం చరణ్ తో డాన్సులు చేయడానికే పరిమితం కావడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశమంతా ఎన్నికల వాతావరణంతో వేడెక్కి ఉన్న ఇలాంటి టైంలో గేమ్ ఛేంజర్ వచ్చి ఉంటే బాగుండేది. అయితే దర్శకుడు శంకర్ ఆలస్యం వల్ల ఈ చిత్రం ఈ సంవత్సరం చివర్లో కానీ విడుదల అయ్యేటట్టు కనిపివ్వడం లేదు.

Also Read: Kavitha Raids: ఎమ్మెల్సీ కవితకు బిగుస్తున్న ఉచ్చు.. ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు

Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News